Balagam: బలగం.. చిన్న సినిమాగా ప్రేక్షకుల మందుకు వచ్చింది. చూసిన ప్రతీ ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతుంది. తెగిపోయి బంధాలను దూరమైన అనుబంధాలను గుర్తుచేస్తోంది. కళ్లు చెమర్చేలా ప్రతీ ఒక్కరితో కనెక్ట్ అవుతోంది. కదిలిస్తోంది.. అనుబంధాలను దగ్గరకు తెస్తోంది. ఇంట్లో ఎవరైనా చనిపోయనప్పుడు 11 రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్నే కథగా మలిచి తెరపై అందరి జీవితాన్ని విష్కరించాడు దర్శకుడు వేణు. చావు లేని ఇల్లు ఉండదు.. ఆ సమయంలో నిర్వహించే కార్యక్రమాలు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. అయితే గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కని మదిలో ఏదో ఒక మూలన ఈ అంశం దాగి ఉంది. దానినే తట్టిలేపింది ‘బలగం’ సినిమాలోని క్లైమాక్స్ పాట… కుటుంబ సంబంధాల్లో అడుగంటిపోతున్న ప్రేమానురాగాల్ని సున్నితంగా స్పృశించింది. తోబుట్టువుల మధ్య ముళ్లకంచెలా మారిన అహాన్ని… పటాపంచెలు చేసింది. అందుకే సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ తెలంగాణ మట్టి వాసన అనుభూతి చెందుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు తెలంగాణ పల్లె కళ్లముందు కదలాడుతోంది. తెలంగాణ ఇపుడు ఒక కొత్త సినిమా చూపిస్తోంది.
కంటతడి పెడుతున్న పల్లెలు..
ప్రేక్షకులకు నచ్చాలి గానీ, చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ఓన్ చేసేసుకుంటారు. ఇది ఇంతకూ మునుపు చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇటీవలి కాలంలో నేటివిటీకి, రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఆమధ్య వచ్చిన జైభీం, కాంతార, పుష్ప, అప్పట్లో వచ్చిన మాతృదేవోభవ.. లాంటి సినిమాలు ప్రేక్షకులకు నచ్చాయి. హృదయాలను తాకాయి. ఆ సినిమాల్లో ప్రేక్షకులు తమను తాము చూసుకున్నారు. తాజాగా కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చి తెలుగు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న బలగం సినిమా విషయంలో మరోసారి సినిమా హిట్ అవ్వాలంటే బడ్జెట్‌తో సంబంధం లేదని ప్రూవ్ అయ్యింది. మరిచిపోతున్న మన సంప్రదాయాన్ని బలగం గుర్తు చేసింది అంటూ ప్రతీ పల్లెలను సైతం కన్నీరు పెట్టిస్తోంది.
నాటి సీన్ నేడు రిపీట్..
పాత లవకుశ, ఒసేయ్ రాములమ్మ, పుట్టింటికిరా చెల్లి, లాంటి సినిమాలకు జనాలు బండ్లు కట్టుకొని మరీ వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు బలగం సినిమాకు కూడా అలంటి సీనే రిపీట్ అవుతోంది. చాలా పల్లెల్లో ఊరి జనాలంతా కలిసి ఒకే చోట ప్రొజెక్టర్ స్క్రీన్ మీద ఈ సినిమాని చూస్తున్నారు. మరో చోట పల్లె జనాలు ఆ ఊరి సర్పంచ్ పై ఒత్తిడి తెచ్చి మరీ ఈ సినిమా స్క్రీనింగ్ వేయించుకున్నారట. ఒక్క సంఘటన చాలు ఈ సినిమా జనాల హృదయాల్లోకి ఎంతలా వెళ్లిందో చెప్పటానికి.
కథ అని తెలిసినా..
సినిమా అంటేనే కథ.. కల్పితం ఆధారంగా తీసినదే. ఆమధ్య వచ్చిన గోరింటాకు సినిమాకు కూడా ప్రేక‌్షకులు కనెక్ట్ అయ్యారు. ఇటీవల వచ్చిన జైభీం కూడా రియల్ స్టోరీ. అది కూడా అందరినీ కదిలించింది. బలగం కూడా ఓ సామాన్య కుటుంబంలో ఎవరైనా చనిపోయన తర్వాత 11 రోజుల కార్యక్రమాల కథ. అందులో దూరమైన అనుబంధాలు ఎలా కలిశాయి.. ఎలా దూరమయ్యాయి.. దూరమైతే చనిపోయిన వారి ఆత్మ ఎలా ఘోషిస్తుంది అనేది బలంగం కళ్లకు కట్టింది. ఈ సినిమా కూడా స్టోరీ అని తెలిసినా గ్రామీణ నేపథ్యం ఉన్న అందరి హృదయాలకు తాకుతూనే ఉంది. విశేషం ఏంటంటే, ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమ్ అవుతున్నా కూడా జనాలు థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. దీంతో మంచి కథకు ఉన్న పవర్ ఏంటో తెలుస్తోంది. కథలో ఒరిజినాలిటీ ఉండటమే బలగం సినిమాకు ప్రధాన బలం. దీనికి తోడు ఇందులో నటించిన వారిలో చాలా మంది కొత్త వారైనప్పటికీ ఆ పాత్రలలో చక్కగా ఇమిడిపోవటం సినిమా అందరికీ కనెక్ట్ కావడానికి మరో కారణం.
పల్లె అందాలను, తెలంగాణ సంప్రదాయాలను, మనుషుల భావోద్వేగాలను బలగం సినిమాల కళ్లకు కట్టింది. అందుకే ప్రతి ఒక్కరూ ఆ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Why are people connected to the movie balagam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com