Anushka Shetty Marriage: అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి అని అనిపించేంత అందం ఉన్న హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి..అక్కినేని నాగార్జున హీరో గా నటించిన సూపర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా అనుష్క ఆ తర్వాత ఏ స్థాయికి ఎదుగుతూ పోయిందో మనం చూస్తూనే ఉన్నాము..తెలుగు , తమిళం మరియు హిందీ బాషలలో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన అనుష్క శెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి సక్సెస్ సాధించిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు.

ఈమె నటించిన అరుంధతి చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టింది..ఇక ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న అనుష్క బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ప్రస్తుతం కొంత కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం.
అందరూ అనుకుంటున్నట్టు గా అనుష్క పెళ్లి ప్రభాస్ తో మాత్రం జరగట్లేదు..బాహుబలి సినిమా ప్రారంభం అయ్యినప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య ఎదో నడుస్తుందని..డేటింగ్ లో ఉన్నారని..త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా లో మారుమోగిపోయ్యే రేంజ్ లో ప్రచారం జరిగింది..అయితే అలాంటిది ఏమి లేదని వీళ్లిద్దరు పలు సందర్భాలలో క్లారిటీ ఇచ్చారు..రీసెంట్ గా ఈమె తన స్వస్థలం మంగళూరులో కాంతారా భూతకోలా ఉత్సవాలలో పాల్గొనడానికి వెళ్ళింది..పెళ్లి కుదిరిన వెంటనే ఆమె దేవుడి ఆశీస్సుల కోసం వెళ్లిందని.

పెళ్లి కొడుకు హైదరాబాద్ కి చెందిన బంగారం వ్యాపారస్తుడని తెలుస్తుంది..ఈ పెళ్ళికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియచెయ్యబోతుంది అనుష్క..ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి తో కలిసి ఒక సినిమా చేస్తుంది..ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది.