Amala Paul: హీరోయిన్ అమలాపాల్ కి తీరని పరాభవం ఎదుర్కొంది. ఆమెకు పూజారులు ఆలయ ప్రవేశం నిరాకరించారు. ఇతర మతస్థులను గుడిలోకి రానివ్వమని ఖరాకండిగా చెప్పారు. తనకు జరిగిన ఈ అవమానకర సంఘటన అమలాపాల్ బయటపెట్టారు. కేరళ ఎర్నాకులంలోని తిరువైరానికులం మహాదేవ ఆలయాన్ని అమలాపాల్ సందర్శించారు. ఆమె గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకోవాలనుకున్నారు. అందుకు ఆలయ కమిటీ, పూజారులు నిరాకరించారు. అన్యమతస్థులకు మహాదేవ ఆలయంలోకి ప్రవేశం ఉందని చెప్పారు.

అమలా పాల్ వారితో వాదించినా ప్రయోజనం లేకుండా పోయింది. గుడి ముందు ఉన్న అమ్మవారికి పూజ చేసుకొని వెళ్లిపోవాలని సూచించారు. ఈ సంఘటన గురించి అమలా పాల్ ఆలయ సందర్శన రిజిస్టర్ లో నమోదు చేశారు. ఆధునిక కాలంలో కూడా మత వివక్ష ఉండటం దారుణ పరిణామంగా అభివర్ణించారు. రానున్న కాలంలోనైనా ఈ మత వివక్ష పూర్తిగా సమాజంలో లేకుండా పోవాలని ఆమె కాంక్షించారు.
తనను ఆలయంలోకి నిరాకరికరించినప్పటికీ అమ్మవారి ఆత్మను మనసులో అనుభవించాను అన్నారు. మదిలో అమ్మవారిని ప్రార్ధించినట్లు అమలా పాల్ చెప్పుకొచ్చారు. అమలా పాల్ క్రిస్టియన్. ఈ కారణంతో మహాదేవ ఆలయ అర్చకులు ఆమెను గర్భగుడిలోకి అనుమతించలేదు. దేశంలోని చాలా హిందూ దేవాలయాల్లో ఈ నిబంధన ఉంది. తిరుమలలో అన్యమత ప్రచారం నిషిద్ధం. ఇండియా సెక్కులర్ కంట్రీ అని చెప్పుకుంటూనే మనం కులాల, మతాల పేరుతో అడ్డుగోడలు కట్టుకుంటాము. పేరుకే చట్టాలు కానీ అవి అమలు కావడం లేదు.

ఇక అమలా పాల్ ఉందంతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ సంఘటనను కొందరు సమర్థిస్తుండగా పలువురు ఖండిస్తున్నారు. కాగా అమలా పాల్ తరచుగా వివాదాల్లో ఉంటారు. తలైవి ఫేమ్ దర్శకుడు విజయ్ ని అమలా పాల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2017లో మనస్పర్థలతో విడిపోయారు. ఇక తెలుగులో ఆమె స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో జతకట్టారు. నాయక్, ఇద్దరమ్మాయిలతో వంటి హిట్ చిత్రాల్లో నటించారు. అమలాపాల్ నటించిన బైలింగ్వెల్ మూవీ ‘ఆమె’. ఈ చిత్రంలో అమలాపాల్ నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. ఆ మధ్య రెండో పెళ్లి వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం పలు చిత్రాలతో ఆమె బిజీగా ఉన్నారు.