https://oktelugu.com/

Adah Sharma: ఆఫర్స్ లేని బన్నీ హీరోయిన్ ఇంతకు తెగిస్తుందనుకోలేదు!

Adah Sharma: ముంబైకి చెందిన ఆదా శర్మ మల్టీ టాలెంటెడ్. అందంతో పాటు డాన్స్, జిమ్నాస్టిక్స్, యుద్ధ విద్యల్లో కూడా ప్రవేశం ఉంది. ఎన్ని కళలు వచ్చినా ఆ లక్ అనేది ఒకటి ఉండాలి. ఆదా శర్మకు అదే మైనస్. ఆమెకు మొదటి నుండి అదృష్టం కలిసి రాలేదు. సోలో హీరోయిన్ గా చేసిన సినిమాలు ఫెయిల్ కావడంతో పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయింది. స్టార్ కాలేకపోయింది. 2008లో విడుదలైన ‘1920’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ఆదా సిల్వర్ స్క్రీన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 11, 2023 / 09:40 AM IST
    Follow us on

    Adah Sharma

    Adah Sharma: ముంబైకి చెందిన ఆదా శర్మ మల్టీ టాలెంటెడ్. అందంతో పాటు డాన్స్, జిమ్నాస్టిక్స్, యుద్ధ విద్యల్లో కూడా ప్రవేశం ఉంది. ఎన్ని కళలు వచ్చినా ఆ లక్ అనేది ఒకటి ఉండాలి. ఆదా శర్మకు అదే మైనస్. ఆమెకు మొదటి నుండి అదృష్టం కలిసి రాలేదు. సోలో హీరోయిన్ గా చేసిన సినిమాలు ఫెయిల్ కావడంతో పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయింది. స్టార్ కాలేకపోయింది. 2008లో విడుదలైన ‘1920’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ఆదా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ఆ మూవీలోని నటనకు ఆదాకు ప్రశంసలు దక్కాయి.

    Adah Sharma

    ఇక దర్శకుడు పూరి జగన్నాధ్ తెలుగులోకి తీసుకొచ్చాడు. హార్ట్ ఎటాక్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆమె పలకరించారు. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం విజయం సాధించలేదు. అనంతరం దర్శకుడు త్రివిక్రమ్ సన్ సత్యమూర్తి చిత్రంలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. చెప్పాలంటే ఆమె పాత్రను సెకండ్ హీరోయిన్ అనడానికి కూడా ఛాన్స్ లేదు. చిన్న వ్యాంప్ రోల్ వంటిది.

    సన్ ఆఫ్ సత్యమూర్తి విజయం సాధించినా… ఆమె కెరీర్ కి ఒరిగిందేమి లేదు. అయితే ఆమె హీరోయిన్ గా నటించిన సస్పెన్సు థ్రిల్లర్ క్షణం పెద్ద విజయం సాధించింది. అడివి శేష్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రేక్షకుల ఆదరణతో పాటు, క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకుంది. హిట్ పడినా ఆదా ఫేట్ మారలేదు. అడపాదడపా ఆఫర్స్ మినహాయిస్తే… కెరీర్ ని నిలబెట్టే ఛాన్స్ రాలేదు.

    Adah Sharma

    2019లో ఆదా వరుసగా తెలుగు, హిందీ, తమిళ చిత్రాలు చేశారు. రాజశేఖర్ కి జంటగా కల్కి మూవీలో నటించారు. హిందీలో బైపాస్ రోడ్, కమాండో 3 చిత్రాల్లో నటించారు. 2021లో ఆమె నుండి ఒక్క సినిమా రాలేదు. గత ఏడాది మీట్ క్యూట్ అనే ఆంథాలజీ సిరీస్తో పలకరించారు. ఈ ఏడాది అక్షయ్ కుమార్ హీరోగా విడుదలైన సెల్ఫీ మూవీలో నటించారు. ఇది డిజాస్టర్ అయ్యింది. ప్రసుతం ‘ది కేరళ స్టోరీ’ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు.

    Adah Sharma

    ఇక ఆఫర్స్ లేని ఆదా అందాల ఆరబోత పనిగా పెట్టుకుంది. తాజాగా విపరీతమైన స్కిన్ షో చేస్తూ ఫోటో షూట్ చేశారు. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సినిమా అవకాశాల కోసం ఆదా శర్మ దర్శక నిర్మాతలను తన గ్లామర్ తో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.