Kannada Actor Darshan: “కుక్క కాటుకు చెప్పు దెబ్బ” అనే సామెత విన్నారా? అదే ఇప్పుడు ఈ కన్నడ హీరో రుచి చూశాడు. ఉపోద్ఘాతం ఏమీ లేదు. నేరుగా విషయం లోకే వస్తున్నాం. అనగగనగా కన్నడ ఇండస్ట్రీ. అతని పేరు దర్శన్. వయసు 50 వరకు ఉంటుంది. అందరు హీరో ల్లాగానే ఇతగాడు కూడా జుట్టుకు రంగులు వేసుకుంటూ కవరింగ్ చేస్తూ ఉంటాడు. ఈమధ్య క్రాంతి అని ఒక సినిమా తీశాడు. దాని ప్రమోషన్ కోసం కర్ణాటకలోని హోస్పేట లో ఓ ఫంక్షన్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఎవరో ఒకతను తన మీద చెప్పు విసిరేశాడు. అది అతడి భుజానికి తగిలింది. దీంతో ఈ సో కాల్డ్ “డీ బాస్” అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. అదే సమయానికి సదరు హీరో గారు ” పర్వా లేదు. చిన్న దెబ్బే గా” అంటూ తమాయించుకున్నారు. పోలీస్ రక్షణ లోకి వెళ్లిపోయాడు.. దీంతో ఆయన ఫ్యాన్స్ కాస్త చల్లబడ్డారు.. లేకపోతే రచ్చ రచ్చ అయ్యేది.. ఎందుకంటే కొంతకాలంగా హోస్పేటలో పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు, ఇతడి అభిమానులకు పడటం లేదు. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే పెద్ద దుమారమే చెలరేగుతున్నది.. అప్పు మీద ఆ మధ్య దర్శన్ ఏవేవో పిచ్చి వ్యాఖ్యలు చేశాడు.. దీంతో అతడి అభిమానులకు ఎక్కడో కాలింది. అప్పటి నుంచి మంట మొదలయింది. ” హో స్పేట కు ఎలా వస్తాడో చూస్తామంటూ” పునీత్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. మీరు కచ్చితంగా రావాలి అంటూ దర్శన్ మీద అతడి ఫ్యాన్స్ ఒత్తిడి తెచ్చారు. కానీ సదరు హీరో చనిపోయిన పునీత్ మీద పిచ్చి వ్యాఖ్యలు చేయడం దేనికి? ఇలా అగ్గి రాజేయడం దేనికీ?

సార్ ది పెద్ద చరిత్రే
అయితే ఈ డీ బాస్ చరిత్ర చూస్తే పెద్ద హీరోయిక్ గా లేదు. సల్లూ భాయ్ లాగే మోస్ట్ కాంట్రవర్సీ పర్సనాలిటీ. 2011 లో భార్య గృహ హింస కేసు పెడితే పరప్పన అగ్రహార జైల్ లో 14 రోజులు శిక్ష అనుభవించాడు. తర్వాత కోర్టు బయట పరిష్కరించుకుని బయట పడ్డాడు. తర్వాత ఫ్యాన్స్ కు బహిరంగ క్షమాపణ చెప్పాడు. మళ్ళీ ఆమే అతడి “అనుచితంగా ప్రవర్తన” వల్ల 2018 లో కూడా పోలీసులను ఆశ్రయించింది. అంతే కాదు దళిత వెయిటర్ మీద చేయి చేసుకున్నాడు. భరత్ అనే ఫిల్మ్ ప్రొడ్యూసర్ ను అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో అతడు ప్రాణ భయంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇవే కాదు సదరు హీరో గారి బయట పడని విన్యాసాలు ఎన్నో.

సొంత జూ కూడా ఉంది
ఈ దర్శన్ కు బైక్ లు,కార్లు అంటే పిచ్చి. మైసూర్ కు దగ్గర లో మాలపల్లి వద్ద సొంత జూ ఉంది. నిజంగా అది జూ నా లేక, కృష్ణ జింక సల్లూ భాయ్ లాగా కవరింగా? ఈ చెండాలం ఎలా ఉన్నా స్లిప్పర్ తో భలే భంగ పడ్డాడు “డీ బాస్”. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. కాక పోతే ఇక్కడే ఒక డౌటానుమానం…అప్పు ను కన్నడలో విపరీతంగా ఆరాధిస్తారు..మొన్న అతడి కర్మకు లక్షలాది మంది హాజరయ్యారు. అతడు బతికి ఉన్నప్పుడు ఒకరి మీద మాట తూలింది లేదు. కానీ ఈ చెప్పు విసిరిన అభిమాని ఎవరో?! అన్నట్టు మాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకునే తలతిక్క క్యారెక్టర్లకు, బ్లడ్ బ్రీడ్ యాక్టర్లకు అప్పుడప్పుడు ఇలాంటి చెప్పు సన్మానం జరగాలి. అప్పుడే చెప్పు చేతల్లో ఉంటారు.