
Vithika: భీమవరం తెలుగు అమ్మాయి అయిన వితికా షేరు కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో పది చిత్రాలకు పైగా చేశారు. కన్నడ చిత్రం ‘అంతు ఇంతు ప్రీతి బంతు’ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచమయ్యారు. తెలుగులో ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రాలు చేశారు. అయితే ఆమెవి సెకండ్ హీరోయిన్ తరహా పాత్రలు కావడంతో గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ షోకి వెళ్లే వరకు వితిక అనే ఒక హీరోయిన్ ఉన్న విషయం తెలియదు.
హీరో వరుణ్ సందేశ్ ని వితిక షేరు ప్రేమ వివాహం చేసుకున్నారు. కెరీర్ పూర్తిగా డల్ అయ్యాక 2015లో వరుణ్ సందేశ్ ని వితిక షేరు పెళ్లి చేసుకున్నారు. అనంతరం 2019లో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. భార్యాభర్తలుగా బిగ్ బాస్ తెలుగు షోలో పాల్గొన్న మొదటి జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. హౌస్లో వీరి గిల్లికజ్జాలు చూడలేక ఆడియన్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు. వరుణ్ వద్దకు వచ్చి వితిక ఇతర కంటెస్టెంట్స్ మీద కంప్లైంట్స్ చేస్తూ ఉండేది. వరుణ్ మాత్రం కూల్ గా వింటూ ఉండేవాడు.
వరుణ్ తన బిగ్ బాస్ జర్నీ మొత్తంలో కోప్పడిన సందర్భాలు చాలా తక్కువ. భార్యతో అప్పుడప్పుడు గొడవలవుతూ ఉండేవి. వరుణ్ ఫైనల్ కి చేరగా వితిక మాత్రం ఎలిమినేట్ అయ్యింది. ఆ సీజన్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. శ్రీముఖి రన్నర్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత వితిక 2021లో విడువులైన పెళ్లిసందD చిత్రంలో కనిపించారు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించారు. కాగా వితిక లేటెస్ట్ లుక్ షాక్ ఇస్తుంది . ఆమె ఏకంగా జీరో సైజ్ డెవలప్ చేశారు. నాభి చూపిస్తూ సూపర్ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.

వితిక షేర్ షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ వైరల్ గా మారింది. కోవిడ్ సోకిన తర్వాత నా శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. దాన్ని నేను అంగీకరించలేకపోయాను. సవాల్ గా తీసుకొని నా శరీరాన్ని ఇలా మార్చుకున్నాను. అనుకుంటే ఏదైనా సాధించగలమని నిరూపించాను, అంటూ తన ఫొటోలకు కామెంట్ పోస్ట్ చేసింది. ఇక వరుణ్ విషయానికి వస్తే మైకేల్ మూవీతో ఆయన విలన్ గా మారారు. నెక్స్ట్ యద్భావం తద్భవతి, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు చిత్రాల్లో నటిస్తున్నారు. మరి వరుణ్ తేజ్ సెకండ్ ఇన్నింగ్స్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.