Hero Nikhil: ఇండియన్ క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ కావడం, హీరోగా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. ప్రతి ఏడాది వేల మంది హీరో కావాలని పరిశ్రమకు వస్తారు. వారిలో కనీసం సిల్వర్ స్క్రీన్ పై కనిపించే అవకాశం వచ్చేది కొందరికే. హీరోగా అవకాశాలు వచ్చినప్పటికీ సక్సెస్ కావడం మరింత కష్టం. బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లకు వరుసగా రెండు ప్లాప్స్ పడితే అవకాశాలు రావు. సొంతగా సినిమాలు నిర్మించుకునే స్థోమత ఉండదు. అందుకే స్వశక్తితో హీరోగా ఎదిగినవాళ్లు చాలా గొప్పోళ్ళని చెప్పొచ్చు.

కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ కెరీర్ బిగినింగ్ లో ఎదుర్కొన్న కష్టాలు చెబితే… హీరోలపై గౌరవం పెరుగుతుంది. చెత్త హీరో, వరస్ట్ సినిమా అని ఈజీగా స్టేట్మెంట్ ఇచ్చేవాళ్లకు హీరోల కష్టం తెలిసొస్తుంది. హీరోగా ఎదిగే క్రమంలో మోసాలు, అవమానాలు చవి చూసినట్లు నిఖిల్ చెప్పుకొచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా నిఖిల్ ప్రయాణం మొదలైంది. సీరియల్స్ కూడా నటించాడు. అక్కడ ఉంటే బుల్లితెరకే పరిమితం కావాల్సి వస్తుందని… సినిమా ఆఫర్స్ కోసం ఆడిషన్స్ కి హాజరవుతూ ఉండేవాడట.
హీరో అవుతావా… అయితే రూ. 50 లక్షలు ఇవ్వు అన్నారట. కొందరు కోటి రూపాయలు కూడా అడిగారట. ఎలాగైనా హీరో కావాలనే తపనలో ఉన్న నిఖిల్… కొందరి మాటలు నమ్మి రూ. 5 లక్షలు ఇచ్చాడట. డబ్బులు తీసుకుని ఒక లక్ష ఖర్చు చేసి కొన్ని రోజులు షూటింగ్ డ్రామా ఆడారట. తర్వాత సినిమా ఆపేశారట. మోసపోయాను, ఇదంతా ఫేక్ అని అప్పుడు తెలిసొచ్చిందట.

శేఖర్ కమ్ముల గారు చాలా జెన్యూన్. నటన నచ్చి నాకు హ్యాపీ డేస్ మూవీలో ఆఫర్ ఇచ్చారని నిఖిల్ తన స్ట్రగుల్స్ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కార్తికేయ 2 తో పాన్ ఇండియా సక్సెస్ వస్తే.. అసలు ఇదంతా ఎలా జరిగింది. నిజమేనా అని నిఖిల్ కి అనిపిస్తుందట. తాను ఎదుర్కొన్న కష్టాలు చూసి… ఈ స్థాయిలో సక్సెస్ కావడాన్ని ఆయన నమ్మలేకపోతున్నానని పరోక్షంగా తెలియజేశాడు. నిఖిల్ లేటెస్ట్ మూవీ 18 పేజెస్ డిసెంబర్ 23న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. క్లాస్ ఆడియన్స్ సినిమాను బాగా ఇష్టపడుతున్నారు.