
Hero Nani: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం ఈ నెల 30 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హీరో నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ఈ సినిమా పై ఆయన పెట్టుకున్న నమ్మకాలూ మామూలివి కాదు. ప్రతీ ఈవెంట్ లో ఆయన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఒక గొప్ప కల్ట్ క్లాసిక్ లో నటించాను అనే అనందం కనపడుతుంది.
కేవలం నాని మాత్రమే కాదు, హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలే పెట్టుకుంది. తన కెరీర్ లో ఈ చిత్రం మరో మహానటి లాంటి మైల్ స్టోన్ గా నిలుస్తుందని బలంగా నమ్ముతుంది కీర్తి సురేష్. ఇందులో ఆమె పోషించిన వెన్నెల అనే పాత్ర ఆ రేంజ్ లో వచ్చిందట. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన పాటలు, టీజర్ , ట్రైలర్ మరియు పోస్టర్స్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో ఈ చిత్రం పై అంచనాలు ఒక రేంజ్ లో పెంచేలా చేస్తున్నాయి.

మరో మూడు రోజుల్లో ఈ చిత్రం అన్నీ బాషలలో విడుదల అవుతున్నందుకు గాను ప్రొమోషన్స్ లో బాగా వేగం పెంచింది మూవీ టీం. నిన్న ఈ సినిమాకి సంబంధించి ‘దసరా ధూమ్ ధామ్’ అనే ఈవెంట్ ని అనంతపురం లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మూవీ టీం మొత్తం హాజరైంది. ఈ సందర్భంగా నాని మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘శ్రీకాంత్ ఓదెల కి ఇది మొట్టమొదటి సినిమా అంటే నమ్మడం చాలా కష్టం, అతను కోరుకున్నట్టు ఔట్పుట్ వచ్చేంతవరకు నిద్రపోని వ్యక్తి, అతని అసిస్టెంట్ టీం మొత్తం కూడా అలాగే ఉంటుంది. నేను ఈరోజు బల్ల గుద్దిమరీ చెప్తున్నాను, రాబొయ్యే రోజుల్లో ఈ సినిమాకి పని చేసిన 12 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ టాలీవుడ్ ని ఎలేసే రేంజ్ కి ఎదుగుతారు రాజమౌళి రేంజ్ లో..సినిమా చూసిన తర్వాత వల్ల పనితనం గురించి మీరే చెప్తారు’ అంటూ నాని మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషనల్ గా మారాయి.