
Hero Nani: దసరా చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాని పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఆయన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. అందుకే చెన్నై, బెంగుళూరు వెళ్లిన నాని స్థానిక సంస్థల ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అనంతరం నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. దసరా టీమ్ పలు నగరాల్లో చక్కర్లు కొట్టనున్నాడు.
దసరా చిత్రం కోసం నాని చాలా కష్టపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి ఖని బొగ్గు గనుల్లో షూటింగ్ జరిపారు. నాని కోల్ మైన్స్ లేబర్ గా కనిపించనున్నారని సమాచారం. విపరీతమైన ఎండ, దుమ్ము, ధూళిలో షూటింగ్ జరపాల్సి వచ్చింది. దసరా చిత్రం కోసం చిత్రీకరించిన ఒక సన్నివేశం తనను రెండు నెలలు వెంటాడినట్లు నాని తాజాగా వెల్లడించారు.
నాని మాట్లాడుతూ… దసరా కోసం ఒక స్టంట్ షూట్ చేశాము. నేను ట్రక్ నుండి క్రింద పడిపోతాను. అందులో ఉన్న బొగ్గు నాపై పడుతుంది. ఈ సీన్ కోసం సింథటిక్ బొగ్గు తెచ్చారు. అయితే అదంతా దుమ్ముతో నిండిపోయి ఉంది. సింథటిక్ బొగ్గు మీద పడ్డాక బయటకు వచ్చే వరకు ఊపిరి తీసుకోకండి. లేదంటే డస్ట్ అంత మీ శరీరంలోకి వెళ్ళిపోతుందని చెప్పారు. ఊపిరి బిగబట్టి నేను ఆ సీన్ లో నటించారు. తెలియకుండానే నాలో ఒక ఫోబియా క్రియేట్ అయ్యింది.

కొన్ని రోజులు నన్ను ఆ సీన్ వెంటాడింది. రెండు నెలలు నిద్ర పట్టలేదు. నాకు తెలియకుండానే ఊపిరి పీల్చుకోవడం ఆపేసేవాడిని. నాకు లోపల ఇబ్బందిగా ఉండేదని… నాని చెప్పుకొచ్చారు. మరి నాని కష్టానికి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. శ్రీకాంత్ ఓదెల దసరా చిత్రాన్ని తెరకెక్కించారు. డార్క్ విలేజ్ పొలిటికల్ డ్రామాగా రూపొందించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె పాత్ర ఈ చిత్రంలో అద్భుతంగా ఉంటుందట. మార్చి 30న దసరా వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దసరా చిత్ర సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దసరా ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు పెరిగాయి.