
Hero Dhanush: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వపడే రేంజ్ నటులలో ఒకరు ధనుష్.విభిన్నమైన కథామాసాలను ఎంచుకుంటూ అద్భుతమైన నటన కనబర్చి నేషనల్ అవార్డుని అందుకున్న హీరో ఆయన.కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం కాకుండా, హిందీ మరియు ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించాడు కానీ తెలుగు సినిమాల్లో నటించలేదు.
Also Read: Ketika Sharma: మెగా హీరోయిన్ అరాచకం… మిర్రర్ ముందు నిల్చొని ప్యాంటు బటన్స్ విప్పేసిన కేతిక
అలాంటి ధనుష్ ఇప్పుడు తెలుగు లో ‘సార్’ అనే చిత్రం చేసాడు.ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిపించారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథి గా హాజరయ్యాడు.మూవీ యూనిట్ మొత్తం ఈ సినిమా మీద ఎంతో నమ్మకం తో మాట్లాడడం ని చూస్తే కచ్చితంగా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతుందని తెలుస్తుంది.

ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వచ్చిరాని తెలుగు మాట్లాడాడు ధనుష్..ఆయన చెప్పే మాటలను జనాలకు బాగా అర్థం అవ్వడం కోసం త్రివిక్రమ్ ట్రాన్స్ లేటర్ గా మారాడు.ధనుష్ మాట్లాడుతూ ‘నాకు తెలుగు సరిగా రాదు , తమిళం మాత్రమే వచ్చు.కానీ మీకోసం వచ్చీ రాని తెలుగు ని మాట్లాడుతాను, తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి.ఇక్కడకి వచ్చిన వాళ్లందరికీ అన్నీ భాషలు వచ్చు, కానీ నాకు తెలుగు రానందుకు సిగ్గు పడుతున్నాను.నాకు లాగానే సముద్ర ఖని గారికి కూడా తెలుగు రాదు,ఇక్కడకి వచ్చినప్పుడు కంపెనీ ఉన్నాడు లే నాకు చాలు అనుకున్నాను, కానీ ఆయన కూడా తెలుగు నేర్చేసుకున్నాడని ఇక్కడకి వచ్చిన తర్వాతే తెలిసింది.ఈ సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది అని చెప్పను కానీ చాలా మామూలు సినిమా , సింపుల్ గా ఉంటూనే చాలా మంచి మెసేజి ఉంటుంది.నా నటన కూడా గొప్పగా ఏమి ఉండదు, ఈ చిత్రం లో చాలా నార్మల్ గానే ఉంటుంది’ అంటూ ధనుష్ ఈ సందర్భంగా మాట్లాడాడు.
Also Read:Anasuya Bharadwaj: అనసూయ చేసిన తప్పేంటి!