Homeట్రెండింగ్ న్యూస్Hero Destini 125 : ఇక పదే పదే సీటు కవర్లు మార్చే అవసరం లేదు.....

Hero Destini 125 : ఇక పదే పదే సీటు కవర్లు మార్చే అవసరం లేదు.. ఏకంగా చెక్క సీటుతో స్కూటర్ తెస్తున్న హీరో కంపెనీ

Hero Destini 125 : హీరో మోటోకార్ప్ 2025 ఆటో ఎక్స్‌పోలో తన అత్యాధునిక డిజైన్, ప్రీమియం ఫీచర్లతో కూడిన డెస్టినీ 125 అజూర్ కాన్సెప్ట్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త కాన్సెప్ట్ భారతీయ మార్కెట్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించడమే కాకుండా కస్టమర్లకు స్టైలిష్ లుక్, టెక్నాలజీ, మంచి పనితీరు అనుభవాన్ని అందించడంపై దృష్టి పెట్టింది. హీరో మోటోకార్ప్ ఇటీవల 2025 ఆటో ఎక్స్‌పోలో తన స్టైలిష్ స్కూటర్ హీరో డెస్టినీ 125 అజూర్ కాన్సెప్ట్‌ను ఇంట్రడ్యూస్ చేసి ఇది మార్కెట్లో సెన్సేషన్ అవుతుందని తెలిపింది. ఈ స్కూటర్ డిజైన్ లోనే కాకుండా హై-టెక్ టెక్నాలజీ, ప్రీమియం అప్పీల్ లోనూ చాలా స్పెషల్. ఈ కొత్త కాన్సెప్ట్ భారతీయ స్కూటర్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకునేందుకు ప్రత్యేకమైన స్టైలింగ్ , ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది.

హీరో డెస్టిని 125 డిజైన్, స్టైల్
హీరో డెస్టినీ అజూర్ కాన్సెప్ట్ డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లో ఉంది. ఈ శాటిన్ తెలుపు, నీలం రంగుల కలయిక స్కూటర్‌కు లగ్జరీ, ప్రీమియం స్టైల్ ను అందిస్తుంది. అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే దాని సీటు, ముందు ఆప్రాన్‌పై ఉడ్ వర్క్ తొడుగు ఉంటుంది. అంటే ఈ సీటును చెక్క కవర్లతో(woodwork inlay) పునఃరూపకల్పన చేశారు, బ్యాక్‌రెస్ట్, కుషనింగ్‌తో తీర్చిదిద్దారు. వైట్ వాల్ టైర్లు, క్రోమ్ ఫినిష్ ఎగ్జాస్ట్ మఫ్లర్ , వుడ్-ఫినిష్ రియర్ వ్యూ మిర్రర్లు వంటి చిన్న వివరాలు దీన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. రెగ్యులర్ స్కూటర్ల నుండి భిన్నమైన దీని డిజైన్ ప్రీమియం, ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.

హీరో డెస్టినీ 125 ఫర్ఫామెన్స్
హీరో డెస్టినీ 125 అజూర్ కాన్సెప్ట్ బైక్ ఇటీవల విడుదల చేసిన డెస్టినీ 125 లో ఉన్న అదే 124 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 7,000 rpm వద్ద 9 bhp పవర్, 5,500 rpm వద్ద 10.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానుంది. ఇది స్మూత్, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని హామీ ఇస్తుంది.

హీరో డెస్టిని 125 ఫీచర్లు, మైలేజ్
ఈ స్కూటర్ ప్రీమియం లుక్స్ తో మాత్రమే కాకుండా ఆధునిక ఫీచర్లతో కూడా వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ కన్సోల్ వంటి సాంకేతికత ఇందులో అందించబడింది. ఈ స్కూటర్ లీటరుకు 59 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని హీరో పేర్కొంది.

హీరో డెస్టినీ 125 ధర, వేరియంట్లు
హీరో డెస్టినీ 125 బేస్ VX ట్రిమ్ ధర రూ. 80,450, మిడ్-ZX ట్రిమ్ ధర రూ. 89,300, టాప్-స్పెక్ ZX+ ట్రిమ్ ధర రూ. 90,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). హీరో డెస్టినీ 125 అజూర్ కాన్సెప్ట్ అనేది భారతీయ స్కూటర్ విభాగంలో ఒక ఫ్రెష్, యూనిక్ ఎంట్రీ. దీని ఉడ్ వర్క్, ప్రీమియం డిజైన్ దీనిని అన్నింటి కంటే స్పెషల్గా నిలబెట్టాయి. స్టైల్, ఫర్ఫామెన్స్, మోడ్రన్ టెక్నాలజీ మధ్య మంచి స్కూటర్ కోరుకునే కస్టమర్లకు ఇది సరైనది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular