Actress Priya Anand: హీరోయిన్ల ఇష్టాఇష్టాలు ఒకేలా ఉండవు. ఒక్కో హీరోయిన్ కి ఒక్కో రకమైన ఇష్టం ఉంటుంది. కొందరి హీరోయిన్ల ఇష్టాలు మాత్రం చాలా విచిత్రంగానూ.. వింతగానూ ఉంటాయి. తాజాగా హీరోయిన్ ప్రియా ఆనంద్ తన వింత కోరికను ఏ మాత్రం సిగ్గు పడకుండా బయట పెట్టేసింది. ఇంతకీ ఆ కోరిక ఏమిటో తెలుసా ? పలు కేసుల్లో నిందితుడైన నిత్యానందను పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతుందట.
‘నేనే నిత్యం నేనే సత్యం, నేనే దేవుడ్ని అంటూ రాసలీల వ్యవహారంలో అడ్డంగా బుక్ అయ్యి, దేశం విడిచి పారిపోయాడు నిత్యానంద. నిత్యానందకు ఎందరో అమాయకులు భక్తులయ్యారు. ఓ ప్రముఖ సినీ నటితో స్వామిగారి రాసలీల వ్యవహారం దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం అయ్యింది. అయినా.. నిత్యానందను ఇంకా నమ్మే భక్తులు ఉండటం నిజంగా విచిత్రమే. ఆ తర్వాత కూడా అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం ఆరోపణలతో నిత్యానంద పై కేసులు నమోదు కావడంతో.. చివరకు రాసలీల స్వామి ఈ దేశం నుంచి మాయమయ్యాడు.
Also Read: ETV Mallemala: డబ్బే కాదు…ఆర్టిస్టులకు అభిమనమూ ముఖ్యమే! అదిలేకే మల్లెమాల నుంచి వలసలు
ఈక్వెడార్ దగ్గరలోని ఒక దీవిని సొంతం చేసుకుని, దానికి కైలాస దేశమని పేరు పెట్టుకుని, అక్కడే నిత్యానంద దేవుడిగా పూజించబడుతున్నాడు. ఐతే, ప్రియా ఆనంద్ తాజగా ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్‌లో సుశాంత్‌తో కలిసి నటించిందీ. ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన పెళ్లి ప్రస్తావన రాగానే.. ‘నిత్యానంద స్వామి అంటే నాకు ఎంతో ఇష్టం.
ఆయన దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది. కాబట్టి అందరూ ఆయనను ఇష్టపడతారు. అందుకే, నేను పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను’ అంటూ ప్రియా ఆనంద్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ప్రియా ఆనంద్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రియా ఆనంద్.. అమెరికాలో పుట్టి పెరిగింది. ఈ బ్యూటీ బహుభాషా నటిగా కూడా పేరు తెచ్చుకుంది. లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది ప్రియా ఆనంద్.
ఇక నిత్యానంద స్వామి తన దివిలో ప్రత్యేక కరెన్సీని కూడా ముద్రించుకున్నాడు. పైగా తన దేశానికి వచ్చే భక్తులకు నేరుగా పరమశివుడి దర్శనమే చేయిస్తానంటున్నాడు. అన్నట్టు కొన్ని నెలల క్రితం నిత్యానంద వింత జబ్బుతో బాధ పడుతున్నట్లు ఓ వార్త బాగా హల్ చల్ చేసింది. ఇంతకీ ప్రియా ఆనంద్ నిజంగానే నిత్యానందను పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి.
Also Read:Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఆనందానికి అసలు కారణం అదేనట?