Amarnath Yatra- MLA Raja Singh: అమర్ నాథ్ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. వరదల కారణంగా కొందరు గల్లంతు కాగా మరికొందరు గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడటంతో వరదల ప్రభావం పెరిగింది. దీంతో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు. అమర్ నాథ్ యాత్రకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం హాజరు కావడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. వరద ముప్పు ఉందనే సమాచారంతో ఆయన వెళ్లిన కాసేపటికే వరదలు ముంచెత్ాయి. ఫలితంగా కొందరు గల్లంతయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

అమర్ నాథ్ లో వర్షం బీభత్సంగా కురియంతో కొండచరియలు విరిగిపడి పదిమంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో నలభై మంది గల్లంతయినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడకు చేరేసరికి వాతావరణం బాగా లేదని అందరూ వెళ్లిపోవాల్సిందిగా అధికారులు కోరారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే వరదలు ముంచెత్తాయి. దీంతో రాజాసింగ్ ఊపిరి పీల్చుకున్నారు. తాను అక్కడే ఉంటే వరదల్లో చిక్కుకునే వాడినని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేవుడే తనను అక్కడి నుంచి పంపించాడని చెబుతున్నారు.
Also Read: ETV Mallemala: డబ్బే కాదు…ఆర్టిస్టులకు అభిమనమూ ముఖ్యమే! అదిలేకే మల్లెమాల నుంచి వలసలు

ప్రాణాపాయం తప్పడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ను భారీ భద్రత నడుమ కాశ్మీర్ కు తరలించారు. ప్రకృతి వైపరీత్యంతో వరదలు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా దూకిన వరదలతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వరదల ధాటికి మనుషులు ఇక్కట్లు పడ్డారు. దీంతో వరదల ప్రభావానికి కొందరు మరణించగా మరికొందరు గల్లంతయినట్లు తెలుస్తోంది. వానదేవుని ఆగ్రహానికి ప్రజలు బలయ్యారు. అమర్ నాథ్ యాత్రలో చోటుచేసుకున్న ప్రమాదంతో చాలా మంది వెనుదిరిగి వెళ్లిపోయారు.
కొండచరియలు విరిగిపడటంతోనే వరద ప్రభావం వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జమ్ముకాశ్మీర్ ఐజీపీ తెలియజేశారు. ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా అటు వైపు వెళ్లొద్దని సూచిస్తున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు అమర్ నాథ్ యాత్ర కొనసాగదని స్పష్టం చేశారు. దీంతో యాత్రికులు నిరాశతోనే వెనుదిరిగారు. దేవుడిని చూసే భాగ్యం తమకు లేదని అనుకుంటూ వెళ్లిపోతున్నారు. వరదల ప్రభావంతో తీవ్ర నష్టమే కలిగింది.
Also Read:TS Govt Free Medicines: వైద్యరంగంలో మరో విప్లవం.. ప్రజలకు ప్రభుత్వం మరో కానుక
[…] […]