Heatwave Alert: వేసవి ( summer ) ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉభయ రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యంగా ఏపీలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. మరోవైపు వడగాలులు సైతం ప్రారంభమయ్యాయి. శుక్రవారం 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: పోలీస్ శాఖలో పని చేసిన వ్యక్తి వై ఉండి.. పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి భయమేంది సామీ..
* మార్చి మొదటి వారం నుంచే..
సాధారణంగా ఏప్రిల్( April) నుంచి వడగాల్పులు ప్రారంభం అవుతాయి. కానీ మార్చి మొదటి వారం నుంచి నమోదవుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కాగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 9 మండలాలు, విజయనగరం జిల్లాలో 13, పార్వతీపురం మన్యం 11, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9, అనకాపల్లిలో ఒకటి, కాకినాడలో నాలుగు, తూర్పుగోదావరి జిల్లాలో 8, పశ్చిమగోదావరిలో ఒకటి, ఏలూరులో 8, కృష్ణాజిల్లాలో ఏడు, గుంటూరులో ఎనిమిది, బాపట్ల జిల్లాలోని ఐదు మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండనుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
* రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
అయితే శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా( state wide ) 80 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గురువారం అనకాపల్లి జిల్లా నాతవరంలో 39.9 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కృష్ణ జిల్లా తోట్ల వల్లూరులో 39.9%, నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 39.5 ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గురువారం ఏడు మండలాల్లో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. 68 మండలాల్లో వాడగాల్పులు ఇచ్చాయి. మండిపడుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సెల్ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. మొత్తానికి అయితే మార్చి ప్రారంభంలోనే ఎండలు దడ పుట్టిస్తున్నాయి.
Also Read: గుండెపోటుతో పెంపుడు కుక్క మృతి..బోరున విలపించిన మంత్రి సురేఖ.. వైరల్ వీడియో