Uttar Pradesh: ఆ ఇంట్లో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బంధుమిత్రుల రాకతో ఇళ్ళంతా సందడిగా మారింది. భోజనాలయిన తర్వాత.. సాయంత్రం బరాత్ వేడుక ప్రారంభించారు. పెళ్లి కుమారుడు, పెళ్లికూతురు ప్రత్యేక వాహనంలో ఉండగా.. ముందు వరుసలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు డీజే శబ్దానికి అనుగుణంగా స్టెప్పులు వేస్తున్నారు. కేరింతలు, చప్పట్లు, ఈలలతో ఆ ప్రాంతం సందడిగా ఉంది. హఠాత్తుగా జరిగిన సంఘటనతో ఆ ప్రాంతం లో విషాదం నెలకొంది.
డీజే శబ్దానికి..
ఉత్తరప్రదేశ్ లో ఓ కుటుంబంలో పెళ్లి వేడుక జరిగింది.. పెళ్లి వేడుక అనంతరం సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో డీజే ఏర్పాటు చేశారు. డీజే శబ్దానికి అనుగుణంగా స్టెప్పులు వేస్తున్న పెళ్లి కుమారుడి తమ్ముడు (15).. ఒక్కసారిగా కింద పడిపోయాడు. చుట్టూ ఉన్న వారంతా ఏమైందని ఆరా తీసేలోపే అతడు అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో హుటాహుటిన వారు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని నిర్ధారించారు. డీజే శబ్ద తీవ్రతకు గుండెపోటు వచ్చిందని వైద్యులు ప్రకటించారు.
అంత తీవ్రత ఉంటుందా
సాధారణంగా మన చెవులు డెబ్బై డెసిబుల్స్ శబ్దాన్ని మాత్రమే తట్టుకోగలవు. 90 దాటితే అత్యంత ప్రమాదకరం. అలా శబ్ద తీవ్రత ఆ స్థాయిలో దాటితే ముందుగా కర్ణభేరి ప్రభావితం అవుతుంది. ఆ తర్వాత అది గుండెపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో చనిపోయిన ఆ బాలుడి విషయంలోనూ ఇదే జరిగిందని తెలుస్తోంది. పైగా ఆ బాలుడికి కేవలం 15 సంవత్సరాల వయసే. అతడు డీజే శబ్దానికి ఉత్సాహంగా స్టెప్పులు వేయటం.. ఆ శబ్ద తీవ్రతకు అతని గుండె ప్రభావితం కావడంతో.. ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చింది. అది అత్యంత తీవ్రంగా రావడంతో అక్కడికక్కడే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఇటీవల డీజే శబ్ద తీవ్రతకు గుండెపోటు వచ్చి ఆకస్మిక మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ బాలుడు చనిపోవడంతో పెళ్ళింట విషాదం నెలకొంది.. ఆ బాలుడు డ్యాన్స్ చేస్తుండగా.. గుండెపోటు వచ్చి చనిపోయిన దృశ్యాన్ని కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
Another Sudden Death Case…
UP: The groom’s younger brother Sudhir was dancing on the DJ. Suddenly he collapsed and died.
He was only 15 years old.pic.twitter.com/JbGesOsV7H— زماں (@Delhiite_) March 7, 2024