Goat Crying: మనిషి తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాడు. తనకు లాభం వస్తుందనుకుంటే దేన్నయినా అమ్మేస్తాడు. అవి జంతువులైనా సరే. ఇంకేమైనా సరే. ఇక్కడో విచిత్రమైన సంఘటన జరిగింది. మేకను అమ్మబోతున్న యజమానిని పట్టుకుని అది ఏడ్వటం అందరిని కలచివేసింది. మనసున్న వారెవరైనా ఆ వీడియో చూస్తే ఏడుపు ఆపుకోలేరు. అంతటి హృదయవిదారకర సంఘటన చోటుచేసుకోవడం బాధాకరం. బక్రీద్ సందర్భంగా ఓ మేకను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న యజమానిని మేక ఒక్కసారిగా కౌగించుకుని మనిషి లా ఏడ్వటం ఆశ్చర్యంలో ముంచెత్తింది.

మనసు లేని మనుషులకంటే మనసున్న జంతువులే నయం అనే మాటలు అందరిలో వినిపించాయి.మనుషులకు జంతువులకు ఒకటే తేడా అవి మాట్లాడలేవు. మనం మాట్లాడతాం. మన భావాలు వ్యక్తం చేస్తాం. వాటికి నోరు లేదు కాబట్టి తమలోని భావాలు పలికించలేవు. కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్. పవన్ కల్యాణ్ చెప్పినట్లు నేను గడ్డం గీసుకుంటాను. అది గీసుకోలేదు. మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నట్లుగా మనుషుల్లా జంతువులకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. మమకారాలు ఉంటాయి.
Also Read: Getup Srinu: సుధీర్ – రష్మి పెళ్లి పై గెటప్ శ్రీను సంచలన కామెంట్స్.. వారిద్దరూ వేరే లోకం అట
తమను పెంచిన వారి పట్ల అవి అమితమైన ప్రేమను వ్యక్తం చేస్తుంటాయి. వీడిపోయే సమయంలో కన్నీరు సైతం పెట్టుకుంటాయి. వీటికి సంబంధించిన ఎన్నో సాక్ష్యాలు కనిపించినా మనిషిలో కర్కశత్వం మారదు.
జంతువులకు కూడా మనసుంటుంది. అవి తమ బాగోగులు చూస్తున్న వారిపై ఆప్యాయత చూపిస్తాయి. ఎన్నో సినిమాల్లో సైతం చూశాం. కానీ మనం వాటిని దూరం చేసుకునేందుకు వెనకాడం. అవి మాత్రం మన నుంచి విడిపోతున్న సమయంలో చాలా బాధ పడతాయి. తమలోని దుఖాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తాయి. కానీ మనం పట్టించుకోం. మనకు కావాల్సింది డబ్బులు తీసుకుని వాటిని ఎవరికో ఒకరికి అమ్మేస్తుంటాం.

అమ్మే సమయంలో అవి పడే బాధ చూస్తే మనకు కూడా కనికరం వేస్తుంది. సాటి జంతువును ఎందుకిలా చేస్తున్నామనే విచారం వచ్చినా అమ్మక తప్పదనే ఉద్దేశంతోనే వాటిని అమ్మి వెళ్లిపోతుంటాం.
ఇటీవల బక్రీద్ సందర్భంగా ఓ యజమాని తన మేకను మార్కెట్ కు తీసుకొచ్చాడు. ఒకరితో బేరం కుదుర్చుకున్నాడు. డబ్బులు కూడా తీసుకున్నాడు. ఇదంతా చూసిన మేక ఏమనుకుందో ఏమో కానీ యజమానిని పట్టుకుని కన్నీటి పర్యంతమైంది. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
యజమాని అంటే మేక ఎంత ఇష్టమో అని వారు కూడా ఏడ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తనను పెంచినందుకు యజమానికి ఇలా మేక కన్నీటితో వీడ్కోలు చెప్పడం అక్కడున్న వారిని సైతం కలచివేసింది.
భావోద్వేగాలు మనుషులకే కాదు జంతువులకు ఉంటాయి. కానీ వాటిని నోరు లేకపోవడంతోనే తమ బాధలను చెప్పుకోలేవు. మేక ఏడ్చిన సన్నివేశానికి అక్కడున్న వారందరు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. యజమాని సైతం కన్నీరు పెట్టుకున్నాడు. కానీ ఏం చేస్తాం. మన బంధం ఇంతే అని సరిపెట్టుకుని వెళ్లిపోవడం అక్కడున్న వారందరిని కలచివేసింది. నోరు ఉన్న మనుషులకంటే నోరు లేని జీవాలే నయం అనే వాదన అక్కడున్న వారందరిలో వచ్చింది. అందరు మేక ఏడ్వడం చూసి తమ కళ్లల్లో నీళ్లు తిరిగాయని విచారం వ్యక్తం చేశారు.
Also Read:Aaraa Survay: ఆరా సర్వే: కాంగ్రెస్ కథ కంచికి.. బీజేపీ ముందుకు.. టీఆర్ఎస్ పరిస్థితిదీ!