
Balagam Director Venu : ‘బలగం’ మూవీ ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో మాటల్లో చెప్పలేం. ఈ మూవీ ఓటీటీలో రిలీజైనా థియేటర్లకు జనం పరుగులు పెడుతున్నారంటూ సినిమా గొప్పతనం గురించి అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి హైప్ లేకుండా కేవలం కథా బలంతో సినిమా బ్లాక్ బస్టర్ కావడం సినీ ఇండస్ట్రీనే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతటి కథను అల్లిన కమెడియన్ వేణుకు అంతర్జాతీయంగా ప్రశంసలు, పురస్కారాలు అందుతున్నాయి. ఈ తరుణంలో వేణుపై బలగం సినిమాలో అల్లుడు క్యారెక్టర్ చేసిన మురళీధర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వేణును మొదట్లో చూసిన ఈయన సినిమాలో నటించాలా? అని అనుకున్నారట. ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఊరూరా ‘బలగం’ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రత్యేక షోలు వేస్తూ ఊరంతా కలిసి చూస్తున్నారు. కనివినీ ఎరుగని రీతిలో సినిమాకు ఆదరణ రావడం ఎవరూ ఊహించలేదు. ఈ సినిమాను తెరకెక్కించిన వేణు ఒకప్పుడు కమెడియన్. తేజ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయనను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. అయితే ప్రభాస్ సినిమా ‘మున్నా’లో ‘టిల్లు’తో మాత్రం ఫేమస్ అయ్యారు. ఆ తరువాత కమెడియన్ గా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు తగ్గిన తరువాత జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన తరువాత వేణు మరోసారి స్టార్ అయ్యారు.
ఈ తరుణంలో వేణు ను ప్రతీ ఒక్కరు కమెడియన్ గానే చూశారు. ఆయన డైరెక్టర్ అంటే ఎవరూ నమ్మలేదు. అయితే కొత్త డైరెక్టర్లను దిల్ రాజు ఎంకరేజ్ చేస్తాడనే పేరుంది. ఆ హోప్ తోనే వేణు దిల్ రాజును కలవడంతో ఈయన సినిమా తీసే అవకాశం లభించింది. దిల్ రాజు సైతం మొదట్లో వేణు కథ చెప్పగా యావరేజ్ ఉంటుందని అనుకున్నారు. దీంతో సినిమా పూర్తయినా సాధారణ ప్రమోషన్ మాత్రమే చేశారు. కానీ కథ మొత్తం జనాలను ఆకట్టుకోవడంతో సినిమా రేంజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులు వెళుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

‘బలగం’ మూవీలో ప్రతీ క్యారెక్టర్ కు ప్రాధాన్యం ఉంది. ఇందులో అల్లుడు పాత్ర పోషించి మురళీధర్ గౌడ్ కూ ప్రిఫరెన్స్ ఉంది. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వేణు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట్లో వేణు డైరెక్షన్లో సినిమా అంటే కొన్ని సెకన్ల పాటు ఆలోచించాడట. ఈయన డైరెక్టర్ ఏంటిరా బాబు అనుకున్నాడట. అయితే దిల్ రాజు సపోర్టు ఉండడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే ఆ తరువాత వేణు గురించి తెలిసి షాక్ అయ్యాడట.
సినిమాలో కొమురయ్య చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ ఏడుస్తారు. కానీ మురళీధర్ గౌడ్ మాత్రం కన్నీళ్లు పెట్టుకోలేదు. అయితే నేనెందుకు ఏడ్వొద్దు అని వేణును అడగగా.. మీ శరీరం బాధతో ఉంటుంది.. మీ మోహం బాధతో ఉంటుంది.. మీ కళ్లు బాధతో ఉంటాయి.. కానీ మీ కన్నీళ్ల నుంచి చుక్క నీరు రావొద్దు.. అని చెప్పగానే మురళీధర్ గౌడ్ షాక్ అయ్యారు. ఇంత టాలెంట్ ఉన్న డైరెక్టర్ ను చిన్న అంచనా వేసినందుకు సిగ్గుపడ్డానని మురళీధర్ గౌడ్ చెప్పారు.