https://oktelugu.com/

Jagitial : వివాహితతో ఎఫైర్ పెట్టుకున్నాడు.. చివరకు పట్టపగలు ఇలా అయిపోయాడు

యువతి సోదరుడు, తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతుడు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Written By:
  • Dharma
  • , Updated On : June 26, 2023 / 07:00 PM IST
    Follow us on

    Jagitial : ఆ యువతిని ప్రేమించాడు. ఆమె పెళ్లి చేసుకున్నా వెంట తిరిగాడు. సన్నిహితంగా మెలిగాడు. ఇది తట్టుకోలేని ఆమె తరుపు బంధువులు దారుణంగా హత్యచేశారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది ఈ దారుణ ఘటన. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బీర్ పూర్ కు చెందిన జువ్వుకింది వంశీ అనే యువకుడు తుంగూర్ లోని డ్రైవింగ్ స్కూల్ లో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం తుంగూర్ వైపు బైక్ పై వెళుతుండగా ఇద్దరు యువకులు బైక్ మరణాయుధాలతో అటకాయించారు. తలపై బలంగా మోదడంతో ఘటనాస్థంలోనే వంశీ మృతిచెందాడు.

    అయితే వంశీ హత్యకు ప్రేమ, వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. వంశీ అదే మండలానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు సన్నిహితంగా తిరిగేవారు. దినిని గుర్తించిన సదరు యువతి తల్లిదండ్రులు కొద్దిరోజుల కిందట వేరే యువకుడితో కుమార్తెకు వివాహం జరిపించారు. అయినా వంశీ తరచూ ఆమెతో ఫోన్ లో మాట్లాడుతుండడం, కలుస్తుండడం జరిగేది. దీనిపై యువతి కుటుంబసభ్యులు, అత్తింటి వారు వంశీకి ఎప్పటికప్పుడు హెచ్చరించేవారు. కానీ వంశీ యువతిని కలవడం మానలేదు. ఈ నేపథ్యంలోనే వంశీ హత్య జరగడంతో అది వారే పనేనని అనుమానిస్తున్నారు.

    తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ మృతుడు తల్లి భాగ్య, బాబాయ్ తో బంధువులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు ఉన్నతాధికారలుు వచ్చి వారిని సముదాయించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. యువతి సోదరుడు, తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతుడు తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.