https://oktelugu.com/

KCR : ఇప్పటికే 15..  కేసీఆర్ కోసం మరో రూ.2 కోట్ల అదిరిపోయే కారు.. ప్రత్యేకత ఏంటంటే?

ఇప్పుడు తాజా ల్యాండ్ క్రూజర్ కొనుగోలు, పూజల హంగామా చూస్తుంటే తప్పకుండా విమర్శలు చుట్టుముట్టే అవకాశముంది. దానిని కేసీఆర్ కూడా ఊహించి ఉంటారు. కానీ సహజంగా ఇటువంటి విషయాలను లైట్ తీసుకుంటారు. బీఆర్ఎస్ నేతలు ఎలాగూ ఎదుర్కొంటారని ధీమాతో తనకు నచ్చిన పనిని కేసీఆర్ కానిస్తుంటారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 26, 2023 / 07:11 PM IST
    Follow us on

    KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ ఏది చేసినా ప్రత్యకంగా ఉంటుంది. ఆయన ప్రత్యేకంగా కనిపించాలని చూస్తుంటారు. ముఖ్యంగా దర్పం, దర్జా వెలగబెడుతుంటారు. ఈ విషయంలో ఎన్నిరకాల విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. ఆ మధ్యన కేసీఆర్ కాన్వాయ్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విపక్షాలు గగ్గోలుపెట్టాయి. అయినా కేసీఆర్ లైట్ తీసుకున్నట్టున్నారు. తాజాగా ఆయన కాన్వాయ్ లోకి భారీ వాహనం ఒకటి వచ్చి చేరింది. దీంతో వాహనాల సంఖ్య 16కు చేరుకుంది.

    సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టుంటుంది. కాన్వాయ్ లో వాహనాలు 15 వరకూ ఉంటాయి. ఒక అంబులెన్స్ సైతం ఉంటుంది. ఇప్పడు తాజాగా రూ.2 కోట్లు విలువ చేసే ల్యాండ్ క్రూజర్ ను కొనుగోలు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఎస్కార్ట్ తో యాదాద్రి చేరుకున్న కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. అక్కడ ల్యాండ్ క్రూజర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాన్వాయ్ లో చేర్చారు.

    ఇప్పటికే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కేసీఆర్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు తాజా ల్యాండ్ క్రూజర్ కొనుగోలు, పూజల హంగామా చూస్తుంటే తప్పకుండా విమర్శలు చుట్టుముట్టే అవకాశముంది. దానిని కేసీఆర్ కూడా ఊహించి ఉంటారు. కానీ సహజంగా ఇటువంటి విషయాలను లైట్ తీసుకుంటారు. బీఆర్ఎస్ నేతలు ఎలాగూ ఎదుర్కొంటారని ధీమాతో తనకు నచ్చిన పనిని కేసీఆర్ కానిస్తుంటారు. ఇది తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. చూడాలి మరీ విపక్షాలు ఏ రేంజ్ లో విరుచుకుపడతాయో.