Transgender Marriage: ఇటీవల కాలంలో ట్రాన్స్ జెండర్లు ఎక్కువవుతున్నారు. లింగమార్పిడి చేసుకుని తమ ఆశలు తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే పెళ్లిళ్లు సైతం చేసుకుంటున్నారు. ఏదో ఒక చోట ట్రాన్స్ జెండర్ల భాగోతం వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు యువతిని ఇష్టపడ్డాడు. తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకున్నాడు. తీరా మొదటి రాత్రి విషయం తెలియడంతో కంగుతిన్నాడు. సదరు ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నా యువతి ట్రాన్స్ జెండర్ అని తేలడంతో విస్తుపోయాడు. జరిగిన పరిణామానికి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తనను మోసం చేశావని పోలీసుల వద్దకు పరుగులు పెట్టాడు.

హర్యానాలోని దర్గాపూర్ లో చోటుచేసుకున్న సంఘటన అందరిలో ఆశ్చర్యం కలిగించింది. సుఖాలాల్ అనే 30 ఏళ్ల యువకుడికి సామాజిక మాధ్యమాల్లో ఓ యువతి పరిచయం అయ్యింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో అతడు విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వారి అనుమతితోనే రాధాకృష్ణ ఆలయంలో యువతిని వివాహం చేసుకున్నాడు. అందరికి విందు ఏర్పాటు చేసి ఘనంగా వేడుక నిర్వహించాడు. తొలిరాత్రి ఆ యువతితో శోభనం ఏర్పాటు చేశారు. ఇక్కడే ట్విస్ట్ ఏర్పడింది.
యువతి గురించి అసలు విషయం తెలియడంతో పెళ్లికొడుకు విస్తుపోయాడు. ఆ యువతి ట్రాన్స్ జెండర్ అని చెప్పడంతో వరుడికి ఏం చేయాలో తోచలేదు. మరుసటి రోజు ఉదయమే పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టాడు. జరిగిన విషయం పోలీసులకు ఫిర్యాదు రూపంలో వెల్లడించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వైరల్ గా మారింది. పెళ్లి ఘనంగా చేసుకున్నా అతడి కోరిక మాత్రం తీరలేదు. దీంతో వధువు విషయం హల్ చల్ చేస్తోంది. నమ్ముకుని పెళ్లి చేసుకున్నందుకు ఇలా మోసం చేయడంపై అతడు కన్నీరుగా విలపిస్తున్నాడు.

దేశంలో ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరో ఏమిటో తెలియకుండా పప్పులో కాలేస్తున్నారు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. అంత భారీ మొత్తంలో ఖర్చు చేసి వివాహం చేసుకుని తీరా సమయానికి ట్రాన్స్ జెండర్ అని తెలుసుకున్నా లాభం లేదు. జరగాల్సిన తంతు జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు. పెట్టిన ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది. తరువాత పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు. అలా అతడి జీవితం సర్వం నాశనం కావడం గమనార్హం.