Gost Gym: మంచి శరీర దారుఢ్యానికి, ఆరోగ్యంగా ఉండడానికి మనం జిమ్‌కు వెళ్తాం. యువత ఎక్కువగా జిమ్‌లలో కసరత్తు చేస్తుంది. అయితే మనుషులే కాదు.. దెయ్యాలు జిమ్ చేయడం ఎప్పుడైనా చూశారా? అందేటి దెయ్యాలే లేవంటుంటే.. ఇంకా దెయ్యం జిమ్ చేయడం అంటున్నారు. అనుకుంటున్నారా.. కానీ మీరు చదివింది నిజమే.. ఈ వీడియో చూస్తే దెయ్యాలు లేవనేవారు కూడా ఉన్నాయని అంగీకరిస్తారు. మరి ఆ వీడియోలో ఏముంది.. దెయ్యం జిమ్ ఎలా చేస్తుందో మీరూ కింది వీడియోల చూడండి.
పార్కులో దెయ్యం..
ఈ వీడియోలో ఓ పార్కులో ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేశారు. నిత్యం ఉదయం అక్కడకు జనం వర్చి వ్యాయామం చేసుకుని వెళ్లిపోతుంటారు. అయితే ఇటీవల ఆ జిమ్‌లో రాత్రి ఎవరో సిమ్ చేస్తున్నట్లు పరికరాల నుంచి శబ్దం వచ్చింది. దీంతో వాచ్‌మెన్.. ఎవరైనా పరికరాలు దొగిలిస్తున్నాడేమో అని చూసేందుకు లోపలికి వచ్చాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ, ఎవరో జిమ్ చేస్తున్నట్లు పరికరాలు కదులుతూ కనిపించాయి. భయపడిన వాచ్‌మెన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.
చుట్టూ జనం ఉన్నా..
పార్కుకు పోలీసులు చేరుకున్నారు. వాచ్‌మెన్‌తోపాటు పార్కు నిర్వాహకులు అక్కడే ఉన్నారు. అయినా అక్కడ ఉన్న పరికరంపై ఇద్దరు జిమ్ చేస్తున్నట్లుగా అవి కదులుతూనే ఉన్నాయి. దీంతో అక్కడకు వచ్చినవారు ఆశ్చర్యపోయారు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధించారు. జిమ్ చేస్తున్న దెయ్యాలు మాత్రం అక్కడ పోలీసులు, సిబ్బంది ఉన్న విషయాన్ని పట్టించుకోలేదు. తమ పని తాము కానిచ్చేస్తాం అన్నట్లు జిమ్ చేస్తూనే ఉండిపోయాయి.
సోషల్ మీడియాలో వైరల్..
దెయ్యాలు జిమ్ చేస్తున్న ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చుట్టూ పోలీసులు ఉన్నా.. అక్కడ జిమ్ పరికరాలు మనుషులు లేకుండా కదలడంపై కామెంట్లు చేస్తున్నారు. రాత్రి పూట జిమ్‌లోకి ఎవరూ రాకుండా భయపెట్టేందుకు ఇలా చేసి ఉంటారని కొందరు, దెయ్యాలు కూడా ఫిట్‌నెస్ కోరుకుంటున్నాయి.. ఒకటి కాదు రెండు దెయ్యాలు ఉన్నట్లు ఉన్నాయి.. పరికరంలో ఏదైనా పాడై ఉంటుంది.. స్ప్రింగ్ కారణంగా అలా ఊగుతుందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.