Bigg Boss Winner Revanth Daughter: బిగ్ బాస్ విన్నర్ రేవంత్ తండ్రైన విషయం తెలిసిందే. అతడు హౌస్లో ఉండగానే భార్య ప్రసవించింది. రేవంత్ హౌస్లోకి వెళ్లబోయే ముందు ఆమె నిండు గర్భవతి. రేవంత్ కి బిగ్ బాస్ కూతురు పుట్టిన విషయం తెలిసియజేశాడు. రేవంత్ ఆనందంతో పాటు భావోద్వేగానికి గురయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ గెలిచి తన కూతురు చేతికి అందిస్తానని శబధం చేశాడు. చెప్పినట్లే రేవంత్ టైటిల్ అందుకున్నాడు. న్యూలీ బోర్న్ బేబీకి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక రేవంత్ కూతురి ఫోటోలు బయటకు వచ్చాయి.

భోగినాడు భోగిపళ్లు పోసి సంబరాలు చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో రేవంత్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు. అది వైరల్ గా మారింది. ఇక రేవంత్ కూతురు చాలా క్యూట్ గా ఉంది. రేవంత్ ఫ్యాన్స్ పాప సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రేవంత్ కూతురు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ కి మొదటి సంతానంగా పాప పుట్టింది.
ఇక ఇండియన్ ఐడల్ గెలిచిన రేవంత్… స్టార్ సింగర్ హోదాలో హౌస్లో అడుగుపెట్టాడు. అయితే ఆయన ప్రవర్తన వివాదాస్పదమైంది. రేవంత్ మాటలు, చేతలు చాలా దురుసుగా ఉండేవి. ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్ పట్ల అతడి ఆట తీరు దారుణంగా ఉండేది. రేవంత్ వలన గేమ్ లో నేను అనేక గాయాలకు గురయ్యాను. రేవంత్ చేసిన దారుణాలు షోలో చూపించలేదని ఇనయా బయటకు వచ్చాక చెప్పారు. ఈ సీజన్ మొత్తం అతనికి ఫేవర్ గా నడిచిందన్న ఆరోపణలు ఉన్నాయి. అతడు గేమ్స్ లో పోరాట పటిమ చూపించినప్పటికీ… సరైన బిహేవియర్ కనబరచలేదు.

ఇది ఫైనల్ లో రిఫ్లెక్ట్ అయ్యింది. రేవంత్ తో పోల్చుకుంటే శ్రీహాన్ ఫేమ్ చాలా తక్కువ. అయినప్పటికీ అతడికి అధిక ఓట్లు వచ్చాయి. నాగార్జున ఆఫర్ చేసిన రూ. 40 లక్షలు తీసుకోకుంటే… శ్రీహాన్ విన్నర్ అయ్యేవాడు. తనపై నమ్మకం లేకపోవడంతో పాటు పేరెంట్స్, ఫ్రెండ్స్ తీసుకోమని చెప్పడంతో శ్రీహాన్ సూట్ కేసు కి టెంప్ట్ అయ్యి అద్భుత అవకాశం కోల్పోయాడు. దృఢమైన విశ్వాసం రేవంత్ ని విన్నర్ చేసింది. ప్రైజ్ మనీ ఇద్దరూ చెరో సగం పంచుకున్నట్లు అయ్యింది. శ్రీహాన్ రూ. 40 లక్షలతో పాటు రూ. 5 లక్షల లెన్స్ కార్ట్ గిఫ్ట్ అందుకున్నాడు. ఇక రేవంత్ గెలుచుకున్న కార్, ఫ్లాట్, ప్రైజ్ మనీ విలువ కూడా రూ. 45 లక్షలు.