https://oktelugu.com/

Pawan Kalyan’s ‘Bro’ movie : పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మూవీ పోస్టర్ లో ఇవన్నీ మీరు గమనించారా..శివభక్తులైతే వెంటనే కనిపెట్టేస్తారు!

ఈ మోషన్ టీజర్ చూసి ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసారు అంత వరకు బాగానే ఉంది, కానీ ఈ మోషన్ పోస్టర్ లో కొన్నిటిని గమనిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం సహజం. ఇందులో పవన్ కళ్యాణ్ బ్లాక్ షూస్ , బ్లాక్ డ్రెస్ వేసుకొని రెండు చేతులు స్టైల్ గా చాపుతూ జల్సా సినిమా రేంజ్ ఫోజులో నిలబడతాడు

Written By: , Updated On : May 18, 2023 / 09:50 PM IST
Follow us on

Pawan Kalyan’s ‘Bro’ movie : పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత వేగవంతంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రం ‘బ్రో’. నిన్న మొన్నటి వరకు #PKSDT అనే వర్కింగ్ టైటిల్ తో పిలువబడింది ఈ చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపిస్తుండగా,సాయి ధరమ్ తేజ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గా నటిస్తున్నాడు.సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.

ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కాసేపటి క్రితమే విడుదల చేసారు, దీనికి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ని అంత స్టైలిష్ లుక్ లో చూసి చాలా అయ్యిందని, ఆయనని మళ్ళీ అలాంటి లుక్ లోకి తీసుకొచ్చినందుకు ఫ్యాన్స్ సముద్ర ఖని ని ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు.

ఈ మోషన్ టీజర్ చూసి ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసారు అంత వరకు బాగానే ఉంది, కానీ ఈ మోషన్ పోస్టర్ లో కొన్నిటిని గమనిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం సహజం. ఇందులో పవన్ కళ్యాణ్ బ్లాక్ షూస్ , బ్లాక్ డ్రెస్ వేసుకొని రెండు చేతులు స్టైల్ గా చాపుతూ జల్సా సినిమా రేంజ్ ఫోజులో నిలబడతాడు.అందరూ ఇదే చూసారు కానీ పవన్ కళ్యాణ్ వేసుకున్న షూస్ కి పాములు ఉండడాన్ని మాత్రం ఎవ్వరు గమనించలేదు.

అలాగే పవన్ కళ్యాణ్ వేసుకున్న టీ షర్ట్ కూడా శివుని రూపం లో కనిపిస్తుంది. అంతే స్వయంగా పరమశివుడే కాలుడి రూపం లో భూలోకం లోకి వచినవాడిగా డైరెక్టర్ ఇందులో పవన్ కళ్యాణ్ ని చూపించబోతున్నాడు అనే విషయం అర్థం అవుతుంది. ఇక ఈ పాత్ర ని సముద్ర ఖని ఎలా తీసాడు అనేది తెలియాలంటే జులై 28 వరకు ఆగాల్సిందే.