
Hyderabad Haunted buildings: ‘దేవుడిని నమ్మిన వారు దెయ్యం కూడా ఉందని నమ్మాలి..’ అని కొందరు సూక్తులు చెబుతుంటారు. అవి ఎంతవరకు నిజమో తెలియదు గానీ.. దేవుడిని నమ్మని వారు మాత్రం దెయ్యం ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకు దెయ్యం నేపథ్యంలో వచ్చిన సినిమాలు హిట్టు కొట్టాయి. ఇప్పటికీ హర్రర్ మూవీస్ ను కొంతమంది ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే రియల్ గా కూడా దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనే చర్చ ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. కొన్ని కారణాల వలనో.. ఇంకేదో తెలియదు గానీ.. పాత భవనాల్లో దెయ్యాలు తిరుగుతాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా హైదారాబాద్ కు కూత వేటు దూరంలో ఉన్న వాటిల్లోనూ దెయ్యాలు ఉన్నాయంటున్నారు. వీటిని శాస్త్రీయంగా ఎవరూ నిరూపించలేదు. కానా అలా ప్రచారమవుతున్న భవనాలేంటో తెలుసుకుందాం..
హైదరాబాద్ లోని కుందన్ బాగ్ లో ఓ ఇంట్లో 56 ఏళ్ల మహిళ తన ఇద్దరి పిల్లలతో కలిసి చనిపోయింది. 2002 లో ఈఘటన తరువాత ఆ భవనంలోకి ఎవరూ అడుగుపెట్టడం లేదు. దీంతో ఆమె ఆత్మ అందులో తిరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణ సమయంలో అనేక సార్లు అల్లర్లు జరిగాయి. ఈ ప్రాజెక్టు కోసం చాలా మంది భూములు ఇవ్వలేదని, దీంతో చాలా మందిని చంపేసారని అంటున్నారు. మరికొందరు బలవంతంగా ప్రాణాలు తీసుకునేలా చేశారని అంటున్నారు. అయితే ఇప్పటికీ వారి ఆత్మలు తిరుగుతున్నయాని ప్రచారం చేస్తున్నారు.

హైదరాబాద్ లో అద్భుత పర్యాటక ప్రదేశం గోల్కొండ ఖిల్లా. ఇందులో ఎన్నో రహస్య మార్గాలున్నాయి. వాటికి అనుగుణంగా అనేక కథనాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. కాకతీయులు 13వ శతాబ్దంలో దీనిని నిర్మించగా.. దీనిని ఆ తరువాత చాలా మంది రాజులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కోటలో వజ్రాలు, వైడుర్యాలు దాగున్నాయని అవి దొంగల పాలు కాకుండా అప్పటి రాజుల ఆత్మలు తిరుగుతన్నాయని అంటున్నారు.
హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కాలనీలో ఓ ఇంటిని తలలేని దెయ్యం కాపాలా కాస్తుందని అంటున్నారు. 50 ఏళ్ల కిందట తన వద్ద అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంతో తీర్చకపోతే అతనిని అప్పు ఇచ్చిన వ్యక్తి చంపేశాడని అంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తలలేని మొండెం తిరుగుతూ ఉంటుందని అంటున్నారు. అయితే ఈ దెయ్యం ఇప్పటి వరకు ఒక్కరికీ హానీ చేయలేదట. చాలా మందికి మాత్రం కనిపించిందట. ఖైరతాబాద్ ఫై ఓర్ పక్కన ఓ పాడుబడిన భవనం కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్లిన వారు తిరిగి రాలేదట. ఓ వైద్య విద్య కళాల ఇందులో నడిపించారు. దెయ్యం పుకార్లురావడంతో కళాశాలను మూసివేశారు.