
Financial Problem: ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు చెప్పాడు. జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి? ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలు ఆనాడే వెల్లడించాడు. తన నీతిశాస్త్రంలో మనిషి కోసం చాలా విషయాల్లో అనుమానాలు తొలగించాడు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలనే దానిపై కూడా స్పష్టత ఇచ్చాడు. మన జీవితంలో ఎటువంటి తప్పులు చేస్తే ఆర్థికంగా నష్టపోతామో విశదీకరించాడు.
కష్టపడే వాడు
నిరంతరం కష్టపడేవాడు జీవితంలో ఎదుగుతాడు. సమయం ఊరికే గడపకుండా టైంను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లేవాడికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఏనాటికైనా కష్టపడే వాడే విజయం సాధిస్తాడు. ఇంట్లో కూర్చుని ఏదీ రావడం లేదని ఉంటే దగ్గరికి రాదు. దానికి కష్టపడి పనిచేయాలి. నిరంతరం పని చేస్తూనే ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. ఇల్లు పావనం అవుతుంది.
నిజాయితీపరుడు
ఎప్పుడు కూడా నిజాయితీతో ఉండేవాడికి డబ్బుకు లోటుండదు. అతడి నిజాయితీయే అతడికి అన్నం పెడుతుంది. అంతేకాని మోసంతో డబ్బు సంపాదించాలనుకునే వాడికి ఎప్పటికి కూడా తన కోరిక నెరవేరదు. నిజాయితీ పరుల దగ్గరే డబ్బు నిలువ ఉంటుంది. ఎలాంటి ఆపదలనైనా ఎదుర్కొని నిలబడి పోరాడతాడు. అబద్ధం ఆడకుండా ఉంటాడు. అలాంటి వారి వెంట లక్ష్మీదేవి ఉంటుంది.
చదువుకున్నవాడు
విద్య లేనివాడు వింత పశువు అన్నారు. అంటే మనలో విచక్షణ ఉండాలంటే చదువు కావాలి. చదువు నేర్చుకున్న వాడు అన్నింటిపై పట్టు సాధిస్తాడు. చదువుకు అలాంటి ప్రాధాన్యం ఉంటుంది. సమస్యల నుంచి బయటపడే దారులు కూడా చదువుకున్న వారికే తెలుస్తాయి. చదువుకుంటే తన తెలివితేటలతో ఎలాగైనా బతుకుతాడు. చదువుకోకపోతే ఇబ్బందులు పడటం ఖాయం.

సంస్కారం లేనివాడు
సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది. మనిషి సంస్కారంతోనే అన్ని సాధిస్తాడు. కుసంస్కారం ఉన్నవాళ్లు జీవితంలో ఎదగలేరు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను సంస్కారం ఉన్న వ్యక్తి తక్షణమే పరిష్కరించుకుంటాడు. మంచి, చెడు విచక్షణతో ఆలోచిస్తుంటాడు. అలాగే తన సమస్యలను ఇట్టే పరిష్కరించుకుంటాడు. ఇలాంటి వారు జీవితంలో ఎలాంటి ఇబ్బందులకు గురికారు.