Homeఅంతర్జాతీయంSundar Pichai Salary: ఉద్యోగుల మెడపై కత్తి.. అతడికేమో 1850 కోట్ల వేతన సంపత్తి

Sundar Pichai Salary: ఉద్యోగుల మెడపై కత్తి.. అతడికేమో 1850 కోట్ల వేతన సంపత్తి

Sundar Pichai Salary
Sundar Pichai Salary

Sundar Pichai Salary: కాకులను కొట్టి గద్దలకు పెట్టడం అంటే ఇదే కాబోలు. చిన్న చిన్న ఉద్యోగులను ఖర్చు తగ్గింపు పేరుతో తొలగించిన గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్.. తన సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ కి మాత్రం కళ్ళు చెదిరిపోయే జీతం ఇచ్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా దేశానికి చెందిన గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే యూరప్, అమెరికా దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడిన నేపథ్యంలో టెక్ కంపెనీలు ముఖ్యంగా ఫేస్ బుక్, అమెజాన్, గూగుల్ వంటి కంపెనీలు తమ ఆదాయాలు దారుణంగా పడిపోయాయని పేర్కొన్నాయి. భవిష్యత్తు ప్రాజెక్టుల మీద కోతలు విధిస్తున్నట్టు ప్రకటించాయి..ఈలోగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలు కావడంతో ఉద్యోగులపై కోతలు విధించడం మొదలుపెట్టాయి.

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఏకంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గత జనవరిలో ప్రకటించింది. ఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఉద్యోగుల్లో ఆరు శాతం కావడం గమనార్హం. కంపెనీ నిర్ణయంతో గూగుల్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు.. ఏప్రిల్ ఆరంభంలో లండన్ కార్యాలయం నుంచి గూగుల్ ఉద్యోగులు వాకౌట్ చేశారు. అంతకుముందు నెలలో జ్యూరిచ్ ఆఫీసుల్లోనూ నిరసన ప్రదర్శనలు చేశారు. అయినప్పటికీ యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. పైగా మరిన్ని కోతలు ఉంటాయని హెచ్చరించింది.. అంతేకాదు వివిధ దేశాల్లో ఉన్న తన కార్యాలయాలను మూత పెట్టడం ప్రారంభించింది.

కాదు తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గూగుల్ గతంలో సకల సౌకర్యాలు అందించేది. ఆడుకునేందుకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, సేద తీరెందుకు ఓపెన్ స్పాలు, నచ్చినవి తినేందుకు రెస్టారెంట్లు ఇలా ఒకటేమిటి సకల సౌకర్యాలు అరచేతిలో ఉంచేది. కానీ ప్రస్తుతం వాటన్నింటిలో కోత విధిస్తోంది. ముఖ్యంగా పాతుకపోయిన ఉద్యోగులను పొమ్మన లేక పొగ పెడుతోంది. విధులేమీ అప్పగించకుండా ఖాళీగా కూర్చోబెట్టడం, లేదా పని ఒత్తిడి పెంచడం వంటి చర్యలు చేపడుతోంది. దీనివల్ల చాలామంది ఉద్యోగులు తామతంట తామే వెళ్ళిపోతున్నారు.

Sundar Pichai Salary
Sundar Pichai Salary

అయితే ఇదంతా జరుగుతుండగానే తన కంపెనీకి చెందిన సీఈవో సుందర్ పిచాయ్ కి 2022 సంవత్సరానికి 226 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 1850 కోట్లకు సమానం) పారితోషికం ప్రకటించింది. ఈ వివరాలను కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. కంపెనీలో సగటు ఉద్యోగి వేతనంతో పోల్చితే ఇది ఈ ఎనిమిది వందల రెట్లు ఎక్కువగా ఉండడం విశేషం. ఇక సుందర్ పిచాకంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులు ఉన్నాయి. మూడేళ్ల కాలానికి సుందర్ పిచాయ్ ఈ స్టాక్ అవార్డు అందుకున్నట్టు గూగుల్ తెలిపింది. 2019 లోనూ సుందర్ పిచాయ్ ఇదే స్థాయిలో ప్యాకేజీ తీసుకున్నారు. ఆ ఏడాది స్టాక్ అవార్డుల రూపంలో ఆయనకు 281 మిలియన్ డాలర్ల పారితోషికం అందింది. గత మూడు సంవత్సరాలుగా పిచాయ్ స్థిరంగా రెండు మిలియన్ డాలర్ల పారితోషికం అందుకుంటున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular