Nizamabad Harika: చీకటిని చూసి తిట్టుకునే బదులు ఆ చీకటిలోనే ఓ చిరుదీపం వెలిగించడం మంచిది అనేది చైనా సామెత. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్నారో సినీకవి. జీవితంలో ఏదైనా సాధించాలనే సంకల్పం ఉంటే చాలు దాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ దిశగా అడుగులు వేయాలి. అనుకున్నది సాధించే క్రమంలో దేన్ని వదలకూడదు. విజయమార్గమే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగితే అపజయం మన నుంచి పారిపోతోంది. విజయం మన ముంగిట నిలుస్తుంది. దీన్ని చాలా మంది నిరూపించారు. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్న ఆసక్తికరంగా మారింది.

నిజామాబాద్ జిల్లాకు చెందిన హారిక డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నది. కానీ పేదరికం అడ్డు రావడంతో కోచింగుకు వెళ్లలేని పరిస్థితి. తండ్రి చిన్ననాడే కాలం చేయడంతో కుటుంబ భారం తల్లిపై పడింది. దీంతో ఆమె బీడీలు చుడుతూ కూతురును చదివించింది. దీంతో ఆమె పదో తరగతి, ఇంటర్ లో మంచి మార్కులు సాధించింది. అందరు నువ్వు డాక్టర్ కావాలని ప్రేరేపించారు. కానీ తనకు ఆర్థిక స్తోమత లేదని ఆమె నిట్టూర్చలేదు. కష్టడి చదవాలని సంకల్పించింది. రెండు సార్లు ఎంట్రన్స్ పరీక్షలు రాసినా ఆశించిన ర్యాంకు రాలేదు. అయినా నిరుత్సాహ పడలేదు.
మూడో ప్రయత్నంలో నీట్ లో మంచి ర్యాంకు సాధించింది. డాక్టర్ సీటు రావడంతో ఆమె జీవితాశయం నెరవేరింది. ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ర్ట స్థాయిలో 700వ ర్యాంకు సాధించి అందరిలో ఆశ్చర్యం కలిగించింది. ఆమె కేవలం యూట్యూబ్ లో ఆన్ లైన్ క్లాసులు విని ఆమె ఇలా ర్యాంక్ తెచ్చుకోవడంతో అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదువుకు పేదరికానికి సంబంధం లేదని చెబుతోంది. పట్టుదల, అంకితభావం ఉంటే ఎంతటి కఠినమైన లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చని చెబుతోంది. తనకు యూట్యూబ్ క్లాస్ లు ఎంతో ఉపకరించాయని పేర్కొంది.

ఏడో తరగతి చదివేటప్పుడు తన టీచర్ చెప్పిన మాటతోనే ఆమె డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. గమ్యాన్ని చేరుకోవడానికి ఎంతో కష్టపడింది. మన అదృష్టాన్ని మన చేతి మీద ఉండే గీతలు కాదు మన చేతలే అని మరోసారి చాటిచెప్పింది. డాక్టర్ చదవడానికి ఎలా ప్రిపేర్ కావాలనే విషయాలు తెలుసుకుని చదువుకుంది. నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించేందుకు ముమ్మరంగా కసరత్తు చేసింది. కోచింగ్ తీసుకోకపోయినా యూట్యూబ్ క్లాసులే తనకు దోహదం చేశాయని ధీమాగా చెబుతోంది.