Homeట్రెండింగ్ న్యూస్Hanuman- Monkey: గంగానదిలో కోతిని కాపాడిన ‘హనుమంతుడు’.. వైరల్ వీడియో

Hanuman- Monkey: గంగానదిలో కోతిని కాపాడిన ‘హనుమంతుడు’.. వైరల్ వీడియో

Hanuman- Monkey: కొన్ని సంఘటనలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ప్రకృతి విపత్తులైనా మానవ పనులైనా ఒక్కోసారి అద్భుతాలు చోటుచేసుకోవడం మామూలే. ప్రకృతి ప్రకోపానికి గురైన ససందర్భంలో కూడా మనకు కొన్ని విషయాలు వింత గొలపడం ఖాయం. ఆమధ్య కేదార్ నాథ్ లో వచ్చిన వరదల్లో శివాలయం వరదలకు కొట్టుకుపోకుండా ఉండి అందరిని ఎంతో ముచ్చటకు గురి చేసింది. అద్భుతమంటే ఇదేనేమో. ప్రకృతి విపత్తులో కూడా పరమేశ్వరుడి ఆలయం నిలబడటం చూస్తే నిజమే అనిపిస్తోంది.

Hanuman- Monkey
Hanuman- Monkey

సృష్టిలో దైవభక్తి ఉండటంతో చాలా మంది ఎన్నో వైవిధ్యమైన పనులు చేసి ఔరా అనిపించుకోవడం చూస్తుంటాం. విధి వైపరీత్యమైనా మన కర్మ ఫలమైనా మనకు ఆపదలు సంభవించే సమయంలో మనం అప్రమత్తంగా ఉన్నా కొన్ని సార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఇక్కడ ఓ గమ్మత్తైన విషయం జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని గాజియాబాద్ లో ఓ వానరం అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కోతి కొంత దూరం కొట్టుకుపోయింది.

కోతి అలా కొట్టుకుపోతున్న నేపథ్యంలో అందరు ఆశ్చర్యపోయారు. నదిలో కొట్టుకుపోతున్న కోతికి నది మధ్యలో ఉన్న హనుమాన్ విగ్రహం ప్రాణాలు పోసింది. వానరం దాన్ని పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంది. కొన్ని గంటల పాటు కోతి అలాగే ఉండటంతో పోలీసులు దాన్ని రక్షించారు. నదిలో చిక్కుకున్న కోతిని తాళ్ల సాయంతో రక్షించి బయటకు తీసుకొచ్చారు. కోతికి ఆంజనేయుడే ప్రాణం పోశాడని అందరు చర్చించుకోవడం కనిపించింది. దైవ భక్తిలో ఇదో పరిణామం. భక్తికి ఏది కూడా సాటి రాదని అందరు చెప్పడం గమనార్హం.

Hanuman- Monkey
Hanuman- Monkey

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది. కోతి తన ప్రాణాలు రక్షించుకోవడంపై అందరు ఆసక్తిగా చర్చించుకున్నారు. ఆంజనేయుడి రూపంలో రక్షణ కల్పించడంతో అందరు సంఘటనపై ఆసక్తి చూపించారు. వీడియో చూస్తూ కోతిని పలువురు అయ్యో పాపం వానరం అంటూ సానుభూతి వ్యక్తం చేశారు. కోతి చేష్టలకు అందరు ముగ్దులయ్యారు. ఆంజనేయుడి విగ్రహం కోతికి ఆసరా నిలవడంపై పలు విధాలుగా మాట్లాడుకోవడం కనిపించింది.

 

నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన హనుమంతుడు | Hanuman Saved Monkey | Drowning  River In Ghaziabad

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version