Drone Hanuman : ఆధునిక ప్రపంచంలో రోజురోజుకి టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోతోంది. మనిషి ఆలోచన పెరిగే కొద్దీ తను చేసే పనులకు సంబంధించిన కష్టాలను సులభతరం చేసుకుంటూ ఈజీ వే లో తక్కువ టైంలో ఎక్కువ పని చేసే విధంగా టెక్నాలజీని వాడుతూ వివిధ పరికరాలను తయారు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే డ్రోన్స్ ని కూడా తయారు చేశారు కొద్దిరోజుల ముందు వరుకు కూడా డ్రోన్ అంటే సినిమాలు తీయడానికి దానిని ఎక్కువ గా వాడుతూ డిఫరెంట్ షాట్స్ ని మేకింగ్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి దానికి డ్రోన్ ని వాడడం అలవాటైపోయింది. ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో విత్తనాలను చల్లడానికి, లిక్విడ్ రసాయనిక మందులని పిచ్ కారి చేయడానికి వాడుతున్నారు.ఇక ఇదే క్రమంలో దేవునికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేయడానికి కూడా డ్రోన్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కడ చూసినా ప్రతి ఫీల్డ్ లో కూడా డ్రోన్ కి సంబంధించిన ఏదో ఒక పనిని ఇన్వాల్వ్ చేస్తూ ఆధునిక టెక్నాలజీని వాడుతూ ముందుకు అన్ని రంగాల్లో ఉన్నా జనం. ముందుకు దూసుకుపోతున్నారు.
विज्ञान से ही धर्म का काम काज भी चल रहा हैं।
pic.twitter.com/ItNpPkC9oH— Santosh Yadav, Ph.D. (@sky_phd) October 25, 2023
ఇక ఇలాంటి క్రమంలో ప్రస్తుతం హనుమాన్ విగ్రహంతో గాలిలో ఎగురుతున్న డ్రోన్ కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే డ్రోన్ కి ఒక మతపరమైన దేవుణ్ణి అనుసంధానం చేస్తూ ఇదొక రకమైన దేవుడి పబ్లిసిటీ చేస్తున్నారంటూ కొంతమంది నాస్తికులు కూడా ఆ వీడియో చూసి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు మేటర్ లోకి వెళ్తే ఒక డ్రోన్ కి ఆంజనేయుడి విగ్రహాన్ని కట్టి దాన్ని గాల్లోకి ఎగిరేసారు దాంతో అది చూసిన హిందూ బంధువులందరికీ ఆంజనేయుడు ఎలాగైతే సప్తసముద్రాలని దాటుతూ ముందుకు దూసుకెళ్లాడో ఆ విజువల్స్ ని చూసినట్టుగా అనుభూతి కలుగుతుంది దాంతో అది చూసిన హిందూ బంధువులందరూ కూడా ఆంజనేయుడి ఆరా ఎలాగైతే ఉంటుందో ప్రస్తుతం గాల్లో ఆ డ్రోన్ అలా ఆంజనేయుడు ప్రతిరూపాన్ని మనకు చూపిస్తుంది అంటూ దాన్ని చూస్తూ సందడి చేస్తున్నారు.
రామాయణంలో ఆంజనేయుడు ఎగిరి సప్త సముద్రాలు దాటి సీతమ్మ జాడ తెలుసుకున్నట్టుగా ఇప్పుడు ఈ డ్రోన్ వల్ల ఆంజనేయుడు రూపం అన్నది చూసే జనాలని అట్రాక్ట్ చేస్తుంది…దీన్ని ఎవరు తయారు చేశారు అనేది తెలీదు గానీ,ఇప్పుడు ఈ వీడియో నెట్లో తెగ వైరల్ అవుతుంది.అలాగే ఆ వీడియో చూసిన జనాలు నిజంగా ఆంజనేయుడిని చూసాము అని అనుకొని ఆ విగ్రహానికి దండాలు కూడా పెడుతున్నారు… ఇక ఇలాంటి క్రియేటివిటీ కి సంబంధించిన పనుల్లో మన ఇండియన్స్ ప్రస్తుతం చాలా ముందు వరుసలో ఉంటున్నారు. ఒకప్పుడు వేరే దేశం వాళ్ళు ఏదైనా క్రియేటివ్ గా ఆలోచించి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అందరికంటే ముందుగా టెక్నాలజీ ని వాడుతూ అద్భుతాలను క్రియేట్ చేస్తున్నారు..