Homeట్రెండింగ్ న్యూస్Gujarat Village Diktat: నిషేధం.. అమ్మాయిలు ఫోన్‌ వాడొద్దట..!

Gujarat Village Diktat: నిషేధం.. అమ్మాయిలు ఫోన్‌ వాడొద్దట..!

Gujarat Village Diktat
Gujarat Village Diktat

Gujarat Village Diktat: నేటి సమాజంలోని అన్నం, నీళ్లు లేకపోయినా బతకగలమేమె కానీ, ఓ గంట సెల్‌ఫోన్‌ లేకుండా ఉండలేకపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతలా ఫోన్‌కు ఎడిక్ట్‌ అయ్యారు. జీవితంలో సెల్‌ఫోన్‌ కూడా భాగమైపోయింది.. ప్రపంచమంతా అరచేతిలో ప్రత్యక్షమైపోతుంది. సెల్‌ఫోన్‌ వాడకం వల్ల ఎంత ప్రయోజనముందో.. అనర్థాలు కూడా అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. ఫోన్‌ కారణంగా పెళ్లికాని యువతీ యువకులే ఎక్కువగా అనర్థాలు ఎదుర్కొంటున్నారు. దీంతో గుజరాత్‌లోని ఓ గ్రామం పెళ్లికాని యువతులు సెల్‌ఫోన్‌ వాడకాన్ని నిషేధించింది.

పెడదారి పడుతున్నారని..
పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పకుండా ఎవర్నో ఒకర్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతారనే భయంతోపాటు.. ఫోన్ల వాడకంతో పిల్లలు పెడదారి పడుతున్నారని గుజరాత్‌ రాష్ట్రంలోని బనస్కంత జిల్లాలోని జలోల్‌ గ్రామ పెద్దలు అమ్మాయిలు ఫోన్‌ వాడకం నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమ్మాయిల చేతిలో ఫోన్‌ కనిపించకూడదని ఆంక్షలు విధించారు. అమ్మాయి సెల్‌ఫోన్‌ వాడితే.. ఆ అమ్మాయి తండ్రికి రూ.లక్షన్నర జరిమానా విధించనున్నట్లు ఆ ఊరి గ్రామ పెద్దలు తెలిపారు. ఇక ఉన్నత చదువులు చదివే అమ్మాయిల రవాణా చార్జీలు ఉమ్మడిగా భరించాలని, పెళ్లి నిశ్చితార్థానికి 11 మందే హాజరు కావాలని, పెళ్లిళ్లు, ఉత్సవాల్లో డీజే నిషేధించాలని కూడా నిర్ణయించారు.

ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో..
ప్రస్తుతమున్న సమాజంలో వారి హక్కులకు భంగం కలగకుండా.. ఎవరు ఏమైనా చేయవచ్చు. ఎవరి ఇష్టం వచ్చిన వారు ఉండవచ్చు. కానీ.. ఈ జలోల్‌ గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఆ ఊరి అమ్మాయి హక్కుల్ని హరించే విధంగా ఉంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అల్పేశ్‌ ఠాకూర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాహ విషయంలో కట్టడి చేసే విషయం బావుంది. కానీ.. ఇలా టీనేజ్‌ అమ్మాయిలను మొబైల్‌ ఫోన్లు వాడకుండా నిషేధం విధించడం మాత్రం సరికాదని పేర్కొన్నారు.మరి జలోల్‌ గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Gujarat Village Diktat
Gujarat Village Diktat

బీహార్‌లో పదేళ్లల క్రితమే..
అవివాహితులైన అమ్మాయిలు మొబైల్‌ ఫోన్లు వాడడాన్ని బీహార్‌లోని ఓ గ్రామ పంచాయతీ పదేళ్ల క్రితమే నిషేధించింది. బీహార్‌లోని చంపారన్‌ డిల్లా సోమగఢ్‌ పంచాయీతీ ఈ నిర్ణయం తీసుకుంది.
తమ ఆదేశాలను ధిక్కరిస్తే అమ్మాయిల కుటుంబాలకు భారీగా జరిమానా విధిస్తామని కూడా పంచాయతీ ఆదేశాలు జారీ చేసింది. వందలాది మంది గ్రామస్తుల అభిప్రాయం తీసుకునే ఈ నిషేధం విధించారు. పాఠశాల పిల్లలు సెల్‌ ఫోన్లు వాడకూడదని ఔరంగాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ ఇదివరకు నిషేధం విధించింది. అదే విధంగా రెచ్చగొట్టే దుస్తులు ధరించవద్దని కూడా ఆదేశించింది.

 

ఎజెండా సెట్ చేసిందెవరు? అమలు చేస్తుందెవరు? || Analysis on ABN Radhakrishna Comments on Pawan Kalyan

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version