
Gujarat Village Diktat: నేటి సమాజంలోని అన్నం, నీళ్లు లేకపోయినా బతకగలమేమె కానీ, ఓ గంట సెల్‌ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతలా ఫోన్‌కు ఎడిక్ట్ అయ్యారు. జీవితంలో సెల్‌ఫోన్ కూడా భాగమైపోయింది.. ప్రపంచమంతా అరచేతిలో ప్రత్యక్షమైపోతుంది. సెల్‌ఫోన్ వాడకం వల్ల ఎంత ప్రయోజనముందో.. అనర్థాలు కూడా అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. ఫోన్ కారణంగా పెళ్లికాని యువతీ యువకులే ఎక్కువగా అనర్థాలు ఎదుర్కొంటున్నారు. దీంతో గుజరాత్‌లోని ఓ గ్రామం పెళ్లికాని యువతులు సెల్‌ఫోన్ వాడకాన్ని నిషేధించింది.
పెడదారి పడుతున్నారని..
పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పకుండా ఎవర్నో ఒకర్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతారనే భయంతోపాటు.. ఫోన్ల వాడకంతో పిల్లలు పెడదారి పడుతున్నారని గుజరాత్ రాష్ట్రంలోని బనస్కంత జిల్లాలోని జలోల్ గ్రామ పెద్దలు అమ్మాయిలు ఫోన్ వాడకం నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమ్మాయిల చేతిలో ఫోన్ కనిపించకూడదని ఆంక్షలు విధించారు. అమ్మాయి సెల్‌ఫోన్ వాడితే.. ఆ అమ్మాయి తండ్రికి రూ.లక్షన్నర జరిమానా విధించనున్నట్లు ఆ ఊరి గ్రామ పెద్దలు తెలిపారు. ఇక ఉన్నత చదువులు చదివే అమ్మాయిల రవాణా చార్జీలు ఉమ్మడిగా భరించాలని, పెళ్లి నిశ్చితార్థానికి 11 మందే హాజరు కావాలని, పెళ్లిళ్లు, ఉత్సవాల్లో డీజే నిషేధించాలని కూడా నిర్ణయించారు.
ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో..
ప్రస్తుతమున్న సమాజంలో వారి హక్కులకు భంగం కలగకుండా.. ఎవరు ఏమైనా చేయవచ్చు. ఎవరి ఇష్టం వచ్చిన వారు ఉండవచ్చు. కానీ.. ఈ జలోల్ గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఆ ఊరి అమ్మాయి హక్కుల్ని హరించే విధంగా ఉంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అల్పేశ్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాహ విషయంలో కట్టడి చేసే విషయం బావుంది. కానీ.. ఇలా టీనేజ్ అమ్మాయిలను మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధం విధించడం మాత్రం సరికాదని పేర్కొన్నారు.మరి జలోల్ గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

బీహార్‌లో పదేళ్లల క్రితమే..
అవివాహితులైన అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడడాన్ని బీహార్‌లోని ఓ గ్రామ పంచాయతీ పదేళ్ల క్రితమే నిషేధించింది. బీహార్‌లోని చంపారన్ డిల్లా సోమగఢ్ పంచాయీతీ ఈ నిర్ణయం తీసుకుంది.
తమ ఆదేశాలను ధిక్కరిస్తే అమ్మాయిల కుటుంబాలకు భారీగా జరిమానా విధిస్తామని కూడా పంచాయతీ ఆదేశాలు జారీ చేసింది. వందలాది మంది గ్రామస్తుల అభిప్రాయం తీసుకునే ఈ నిషేధం విధించారు. పాఠశాల పిల్లలు సెల్ ఫోన్లు వాడకూడదని ఔరంగాబాద్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ ఇదివరకు నిషేధం విధించింది. అదే విధంగా రెచ్చగొట్టే దుస్తులు ధరించవద్దని కూడా ఆదేశించింది.
