Homeఆంధ్రప్రదేశ్‌YCP Discontent: వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి..

YCP Discontent: వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి..

YCP Discontent
YCP Discontent

YCP Discontent: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడిన వైసీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి.. కొనసాగుతోంది. అవకాశం దొరికిన ప్రతిచోట ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వైసీపీలో ఎమ్మెల్యేల అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఏపీలో నాలుగేళ్లు పాలన పూర్తి చేసుకుంటున్న వైసీపీకి అసంతృప్తి ఎమ్మెల్యేలు వరస షాకులిస్తున్నారు. ఒక్కొక్కరిగా తమ అసంతృప్త స్వరాలను బయటపెడుతున్నారు. మరో ఏడాది కాలం ఉన్న పదవికి ముప్పు ఉంటుందని తెలిసిన అసంతృప్తిని మాత్రం సందర్భాన్ని బట్టి బయటపెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే తమ అసంతృప్తి బయట పెట్టేందుకే సందర్భాలను వెతుక్కుంటున్నట్లు కనిపిస్తోంది.

24 గంటల్లో సస్పెండ్ చేసిన వైసిపి..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు వైసిపి ఎమ్మెల్యేలను ఏమాత్రం ఆలోచించకుండా అధిష్టానం 24 గంటల్లోనే పార్టీ నుండి సస్పెండ్ చేసింది. వీరిని సస్పెండ్ చేయడం ద్వారా అసంతృప్త ఎమ్మెల్యేలకు బలమైన సంకేతాలను జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్లు అయింది. తోక దాడిస్తే వేటు తప్పదని జగన్ పంపిన హెచ్చరికలు పార్టీలో అసంతృప్తి ఎమ్మెల్యేలను ఆలోచనలో పడేయడం ఖాయమని అంతా భావించారు. అయితే ఈ హెచ్చరికలను వైసిపి అసంతృప్త ఎమ్మెల్యేలు ఏమాత్రం లెక్క చేయడం లేదని తెలుస్తోంది. తాజాగా మరో అసంతృప్తి ఎమ్మెల్యే తన స్వరం వినిపించారు. ఓ సందర్భాన్ని వెతుక్కోను మరి ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కారు.

తిరుపతి దర్శనంపై ఎమ్మేల్యే అన్నా రాంబాబు ఫైర్..

తాజాగా తిరుమల దర్శనానికి వెళ్లిన వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అక్కడ అధికారుల తనకు మాత్రమే ప్రోటోకాల్ దర్శనం కల్పించి.. తన భార్యకు జనరల్ బ్రేక్ దర్శనం మాత్రమే ఇప్పించడంపై ఆయన ఫైర్ అయ్యారు. స్వయంగా సీఎంవోలో కీలక అధికారి ధనుంజయ రెడ్డి నుంచి సిఫార్సు లేక తెచ్చుకున్న టీటీడీ అధికారులు లెక్క చేయకపోవడంపై అన్నా రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దర్శనం చేసుకున్న సమయంలో 200 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాని వారు ప్రోటోకాల్ దర్శనం చేసుకుని వెళ్లారని, తన ఫ్యామిలీకి ఆ అవకాశం కల్పించకపోవడం ఏంటని సంచలన ఆరోపణలు చేశారు.

రాంబాబు ఆరోపణలపై స్పందించిన టిటిడి..

ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన ఆరోపణల స్పందించిన టిటిడి వివరణ ఇచ్చింది. ఎమ్మెల్యేతో పాటు పదిమందికి, సీఎంవో నుంచి పదిమందికి, టీటీడీ చైర్మన్ ఆఫీస్ నుంచి ఇంకో పదిమందికి ప్రోటోకాల్ దర్శనం సిఫార్సులు తెచ్చుకున్నారని వెల్లడించింది. దీంతో ఎమ్మెల్యేతో పాటు పదిమందికి ప్రోటోకాల్ దర్శనం కల్పించామని, మిగిలిన వారికి మాత్రం జనరల్ బ్రేక్ దర్శనం మాత్రమే కల్పించినట్లు వివరణ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే వైసీపీలో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న అన్నా రాంబాబు.. తన అసంతృప్తిని బయటపెట్టేందుకే ప్రోటోకాల్ దర్శనం వ్యవహారాన్ని వాడుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.

YCP Discontent
YCP Discontent

మరింత మంది బయటకు వచ్చేనా..

అధికార పార్టీలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి జ్వాలలు ఎగసిపడే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది బయటకు వచ్చే వారి సంఖ్య పెరగనున్నట్లు చెబుతున్నారు. గత నాలుగేళ్లుగా అధికారాలు లేక, నిధులు లేక.. తీవ్ర అసహనంతో ఉన్న ఎమ్మెల్యేలు సందర్భాన్ని చూసి తమ అసంతృప్తిని బయటకు వెళ్ళగక్కే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు ఏడాదే సమయం ఉన్నందున ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్న భావన కొందరు ఎమ్మెల్యేలు ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలిచిన పెద్దగా ఉపయోగం ఉండదన్న భావనతో ఉన్నవాళ్లు అసంతృప్తిని బయటికి వెళ్లగక్కే అవకాశం కనిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular