Viral News: వివాహమనేది జీవితంలో మధురానుభూతి. అందుకే దాని అనుభూతుల్ని జీవితాంతం నెమరువేసుకుంటారు. అబ్బో మా పెళ్లి అలా జరిగింది ఇలా జరిగింది అంటూ గొప్పలు చెబుతుంటారు. మనదేశంలో వివాహ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ పెళ్లిని జరుపుకుని ఆనందపడుతుంటారు. కానీ ఇక్కడో గమ్మత్తైన విషయం చోటుచేసుకుంది. వివాహ సమయానికి ఆలస్యంగా రావడంతో ఏకంగా పెళ్లి కుమారుడినే మార్చేశారు.

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఏప్రిల్ 22న కండారీ గ్రామానికి చెందిన యువకుడితో మల్కాపూర్ పాంగ్రా గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెళ్లి కుమారుడు సమయానికి రాకపోవడమే. పెళ్లి సమయానికి చేరుకోవాలని ఊరి నుంచి బంధువులు, స్నేహితులతో బయలుదేరిన పెళ్లి కొడుకు బరాత్ లో బిజీగా అయిపోయాడు. దీంతో సమయం చూసుకోలేదు.
Also Read: Star Heroine: స్టార్ హీరోయిన్ అందాల వల.. ఫిదా అవుతున్న నెటిజన్లు..!
నాలుగు గంటలకు ఉన్న ముహూర్తం కాస్త దాటిపోయింది. దీంతో పెళ్లి కొడుకు రాత్రి 8 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నాడు. దీంతో అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయి తరఫు బంధువుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో వివాహం చేసుకోకుండా పెళ్లికొడుకు వెనుదిరిగాడు. మరుసటి రోజు వధువుకు వారి బంధువుల్లోని వేరే అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించారు.

మరోవైపు వరుడికి కూడా వేరే వధువుతో పెళ్లి జరిపించారు. దీంతో ముహూర్తం చూసుకోకుండా ఆలస్యం చేసినందుకేు పెళ్లి కొడుకును మార్చేయడం విమర్శలకు తావిచ్చింది. పెళ్లి అంటే కాస్త అటో ఇటో జరగడం చూస్తుంటాం. కానీ ఇక్కడ సమయాభావం రెండు కుటుంబాల్లో మనస్పర్దలు పెంచి పెళ్లి కుమారుడు, కుమార్తెలను మార్చేయడం సంచలనం సృష్టించింది.
Also Read:Surya Grahan 2022: సూర్య గ్రహణం తరువాత ఈ రాశులు వారికి పట్టిందల్లా బంగారమే?