
NTR Party: బుధవారం రాత్రి ఎన్టీఆర్ నివాసంలో గ్రాండ్ పార్టీ జరిగింది. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ఈ డిన్నర్ నైట్ కి రాజమౌళి, కొరటాల శివ, మైత్రీ నవీన్ యెర్నేని, రవి శంకర్ తో పలువురు హాజరయ్యారు. అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ జేమ్స్ ఫెర్రెల్ ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. తన నివాసంలో జరిగిన ఈ పార్టీ గురించి ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. శ్రేయోభిలాషులు, సన్నిహితులతో గడిపిన ఈ క్షణాలు అద్భుతం అంటూ ఎన్టీఆర్ తన ఆనందం పంచుకున్నారు.
ఎన్టీఆర్ ఇంట్లో గ్రాండ్ పార్టీ… హఠాత్తుగా ఏం జరిగింది?
ఎన్టీఆర్ సడన్ గా ఈ ఈవెంట్ ఏర్పాటు చేయడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. అమెజాన్ స్టూడియోస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రెల్ హాజరు కావడం విశేషత సంతరించుకుంది. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలిచిన నేపథ్యంలో రామ్ చరణ్ తన బర్త్ డే గ్రాండ్ గా జరుపుకున్నారు. ఆస్కార్ విజయాన్ని, పుట్టినరోజును కలిపి తన నివాసంలో భారీ విందు ఏర్పాటు చేశారు. దాదాపు టాలీవుడ్ మొత్తం ఈ పార్టీకి హాజరయ్యారు.

ఎన్టీఆర్ మాత్రం రాలేదు. రామ్ చరణ్ మిత్రుడు ఆర్ ఆర్ ఆర్ కో స్టార్ అయిన ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఉండి కూడా డుమ్మా కొట్టడం చర్చకు దారితీసింది. ఇక ఎన్టీఆర్ నివాసంలో జరిగిన పార్టీకి రామ్ చరణ్ రాలేదు. అయితే ఆయన రాకపోవడానికి కారణం ఉంది. రామ్ చరణ్ ఇండియాలో లేరు. దుబాయ్ లో భార్య ఉపాసనతో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ క్రెడిట్ ఎవరికి ఎక్కువ దక్కిందనే విషయంలో రామ్ చరణ్-ఎన్టీఆర్ ల మధ్య మనస్పర్థలకు దారితీసిందనే వాదన ఉంది.

అలాగే ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ వేడుక పేరుతో టాలీవుడ్ పెద్దలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కీరవాణి, చంద్రబోస్ లను సత్కరించారు. ఈ వేడుక సప్పగా సాగింది. ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి హాజరు కాలేదు. ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం ఈవెంట్ కి దూరంగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య లేకుండా సన్మాన కార్యక్రమమా అని నిర్మాత నట్టి కుమార్ విమర్శించారు.
An evening well spent with friends and well wishers. Was great catching up with James and Emily. Thanks for keeping your word and joining us for dinner. pic.twitter.com/Zy0nByHQoq
— Jr NTR (@tarak9999) April 12, 2023