
Anasuya Bharadwaj GYM: అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. నటిగా కొన్నేళ్లు ఆమెకు డోకా లేదనిపిస్తుంది. ఓ తరహా పాత్రలకు అనసూయ బెస్ట్ ఛాయిస్ అవుతున్నారు. మరి నటిగా రాణించాలంటే అందం, ఆహార్యం మైంటైన్ చేయాలి. షేప్ అవుట్ అయిన నటులకు ఆఫర్స్ రావు. అనసూయకు ఉన్న ఇమేజ్ రీత్యా ఆమె హాట్ గా ఉంటేనే జనాల్లో క్రేజ్. 37 ఏళ్ల అనసూయ స్లిమ్ గా ఉండటం అంత ఈజీ కాదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా బరువు పెరిగిపోవచ్చు. అందుకే జిమ్ లో గంటల తరబడి శ్రమిస్తోంది.
షూటింగ్స్ ఉన్నప్పుడు కుదరకపోయినా… వీకెండ్స్ తో పాటు ఖాళీ సమయాల్లో వ్యాయామం ఖచ్చితంగా చేస్తుంది. ఆహార నియమాలు పాటిస్తుంది. అనసూయ ప్యూర్ వెజిటేరియన్. నీచు ముట్టరు. శాకాహారిగా ఉండటం కలిసొచ్చే అంశమే. ఆమె గ్లామర్ కి ఇది కూడా కారణం. తాజాగా జిమ్ ఫిట్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. జిమ్ సెషన్ ముగిశాక మిర్రర్ సెల్ఫీలు దిగింది.

అందాలు అద్దంలో చూసుకుంటూ బోల్డ్ ఫోజుల్లో టెంపరేచర్ పెంచేసింది. అనసూయ ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతుంది. ఇక అనసూయ యాటిట్యూడ్ చూస్తే ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గేదేలే అన్నట్లు ఉంది. తరచుగా అనసూయ ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. ఎవరు ఏమనుకున్నా మై లైఫ్ మై రూల్స్ అన్నట్లు ఆమె తీరు ఉంటుంది.
ఇక అనసూయ లేటెస్ట్ మూవీ రంగమార్తాండ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. వసూళ్లు మాత్రం రాలేదు. రంగమార్తాండ ప్రకాష్ రాజ్ కోడలు పాత్రలో అనసూయ అలరించారు. అనసూయ రోల్ కి ప్రశంసలు దక్కాయి. గత ఏడాది ఇతర భాషల చిత్రాలతో పాటు తెలుగులో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించారు. అనసూయ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ ల ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది.

అనసూయ పూర్తిగా యాంకరింగ్ వదిలేశారు. ఇకపై ఆ ఆలోచన కూడా లేదని చెప్పేశారు. టీఆర్పీ కోసం చేసే ఛీప్ ట్రిక్స్ నచ్చక యాంకరింగ్ వదిలేశాని అనసూయ వెల్లడించారు. నటిగా బిజీగా ఉన్న అనసూయకు చెప్పాలంటే యాంకరింగ్ చేయాల్సిన అవసరం లేదు.