
Gopichand Ramabanam: పరిశ్రమలో ఉండాలంటే హిట్ కొట్టాలి. విజయాలు రాకపోతే మైలేజ్ పడిపోతుంది. హీరో గోపీచంద్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఒక్క హిట్ అంటూ ఆయన కొట్టుకులాడుతున్నారు. దర్శకుడు టి. కృష్ణ కుమారుడైన గోపీచంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సక్సెస్ రాకపోవడంతో విలన్ అయ్యారు. విలన్ గా సక్సెస్ అయ్యాక హీరోగా ప్రయత్నం చేసి విజయం సాధించారు. యజ్ఞం గోపీచంద్ ని హీరోగా నిలబెట్టింది. రణం, లక్ష్యం, శౌర్యం వంటి హిట్స్ తో టైర్ టు హీరోల జాబితాలో చోటు సంపాదించారు. మాస్ హీరోగా ఎదిగి ఒక దశలో స్టార్ రేంజ్ కి దగ్గరయ్యాడు.
ఒక హిట్ పడితే వరుసగా రెండు మూడు ప్లాప్స్ పడేవి. ప్రజెంట్ సిట్యుయేషన్ చెప్పాలంటే… ఆయన హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. జిల్ మాత్రమే ఈ మధ్య కాలంలో ఆయన నటించిన హిట్ చిత్రంగా ఉంది. 2021లో సీటీమార్, ఆరడుగుల బుల్లెట్ విడుదల చేశారు. ఇవి రెండు డిజాస్టర్స్. ఇక ఆరడుగుల బుల్లెట్ ఎప్పటిదో పాత చిత్రం. రిలీజుకు నోచుకోక ఆగిపోయిన చిత్రాన్ని దుమ్ము దులిపి విడుదల చేశారు.
ఇక ఫార్మ్ లో ఉన్న మారుతి హిట్ ఇస్తాడని గోపీచంద్ చాలా ఆశపడ్డారు. అయినా నిరాశే ఎదురైంది. పక్కా కమర్షియల్ సైతం ఆడలేదు. ఈ క్రమంలో గోపీచంద్ తో మూవీ చేసేందుకు దర్శకులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏమాత్రం ఫార్మ్ లో లేని శ్రీవాస్ కి అవకాశం ఇచ్చాడు. ఆయన రామ బాణం అంటూ గోపీచంద్ తో యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు.

రామ బాణం మూవీ విడుదల తేదీ ప్రకటించారు. సమ్మర్ కానుకగా మే 5న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించారు. మరి రామ బాణంతో అయినా గోపీచంద్ విజయం అందుకుంటాడేమో చూడాలి. హీరోయిన్ డింపుల్ హయాతి, దర్శకుడు శ్రీవాస్ కి కూడా ఈ మూవీ సక్సెస్ చాలా అవసరం. ఇటీవల గోపీచంద్, ప్రభాస్ అన్ స్టాపబుల్ షోకి గెస్ట్స్ గా వచ్చారు. ఆ షోలో ప్రభాస్ తో ఆయన అనుబంధం బయటపడింది. ప్రభాస్ కి గోపీచంద్ ఎంత క్లోజో జనాలు తెలుసుకున్నారు.
#Ramabanam hitting Theatres on May 5th!!@DirectorSriwass @vishwaprasadtg @DimpleHayathi @MickeyJMeyer @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/0sX11TXvc1
— Gopichand (@YoursGopichand) March 4, 2023