Google Pune Office: గూగుల్ లో ఉద్యోగం అంటే అలానే ఉంటుంది మరి.. వైరల్ వీడియో

గూగుల్ సంస్థకు మన దేశంలో ఐదు కార్యాలయాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం మాత్రం హైదరాబాదులోనే ఉంది. హైదరాబాద్, బెంగళూరు తర్వాత ఆ స్థాయిలో ఐటి కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది పూణె నగరం.

Written By: Suresh, Updated On : February 20, 2024 10:15 am

Google Pune Office

Follow us on

Google Pune Office: టెక్ జాబ్ అంటేనే అనేకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. అయినప్పటికీ చాలామంది ఆ ఉద్యోగాలు ఎందుకు చేస్తారంటే.. ఒక్క నెల జీతం రాకపోతే జీవితం తారు మారవుతుంది కాబట్టి.. టెక్ కంపెనీలు ఉద్యోగులకు కల్పించే సౌకర్యాల విషయంలో బయట ప్రపంచానికి కాస్త తక్కువే తెలుసు.. కోవిడ్ నుంచి చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని ఉద్యోగులకు కల్పించాయి. కోవిడ్ తర్వాత జాబ్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. చాలామంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడుతున్నారు. అయితే ఉన్నవారిపై కంపెనీలు పని ఒత్తిడి పెంచుతున్నప్పటికీ.. వారికి కల్పించే సౌకర్యాలు మెరుగ్గా ఉంటున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.. అయితే ఈ జాబితాలో గూగుల్ తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం కల్పించే సౌకర్యాలు వేరే లెవెల్ లో ఉంటాయని టెక్ నిపుణుల అభిప్రాయం. ఇంతకీ గూగుల్ తన ఉద్యోగుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది? ఎలాంటి సౌలభ్యాలను అందుబాటులోకి తెస్తుంది? వీటిపై ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

గూగుల్ సంస్థకు మన దేశంలో ఐదు కార్యాలయాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం మాత్రం హైదరాబాదులోనే ఉంది. హైదరాబాద్, బెంగళూరు తర్వాత ఆ స్థాయిలో ఐటి కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది పూణె నగరం. ఈ నగరంలో ఇటీవల కోరేగావ్ పార్క్ ఎనెక్స్ లో గూగుల్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించి గూగుల్ ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తుంది. ఈ కార్యాలయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ కార్యాలయాలన్నింటితో కలిసి పనిచేస్తుంది. పూణె లో గూగుల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ష్ గోయల్ తన కొత్త ఆఫీస్ ఎలా ఉందో ఫోన్ లో వీడియో రికార్డు చేసి నెటిజన్ల తో పంచుకున్నాడు. అందులో కనిపించిన దృశ్యాలు చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.

అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. ఉద్యోగులు సేద తీరేందుకు రిలాక్స్ రూమ్, నచ్చిన ఆటలు ఆడుకునేందుకు గేమింగ్ జోన్, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉన్న కార్యాలయ ఆవరణం, నోరు ఊరించే ఆహార పదార్థాలు ఉన్న కేఫ్ (impressive interiors)ను చూసి నెటిజన్లు వారేవా ఇది కదా అదృష్టం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంటికంటే ఉత్తమం అనిపించే విధంగా ఉన్న ఈ వాతావరణం జనాలకు విపరీతంగా నచ్చుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 4.8 లక్షల మంది చూశారు. ఈ వీడియోను చూసిన తర్వాత గూగుల్ సంస్థలో పనిచేయాలనిపిస్తోందని అనేకమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందువల్లే గూగుల్ సంస్థలో పనిచేయడానికి చాలామంది పోటీ పడుతుంటారని కామెంట్ చేశారు. ఇక గూగుల్ సంస్థ అమెరికా తర్వాత అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో నిర్మిస్తోంది. 2019లో గచ్చిబౌలి 7 ఎకరాల స్థలాన్ని ఇందుకోసం కొనుగోలు చేసింది. మూడు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ నిర్మిస్తోంది. గత ఏడాది మార్చిలో ఈ క్యాంపస్ నిర్మాణం కోసం గూగుల్ కొత్త డిజైన్ పొందించింది.