https://oktelugu.com/

Google CEO Sundar Pichai House: అంబానీని మించి ఇల్లు కట్టుకున్న గూగుల్ సుందర్ పిచాయ్.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలుసు కదా! తన అచంచలమైన ప్రతిభతో గూగుల్ కంపెనీ సారధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆమధ్య తమిళనాడులోని తన ఇంటిని విక్రయించినప్పుడు చాలామంది సుందర్ కు ఏమైంది అని అనుకున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : August 14, 2023 / 01:12 PM IST

    Google CEO Sundar Pichai House

    Follow us on

    Google CEO Sundar Pichai House: వంద కోట్లకు పైగా జనాభా ఉన్న మనదేశంలో ఖరీదైన ఇళ్ల ప్రస్తావన వస్తే అందరూ వెంటనే చెప్పే సమాధానం అంటిలియా.. స్వర్గంలో ఉన్న సౌకర్యాలు ముఖేష్ అంబానీ కలల సౌధం సొంతం. పీల్చేగాలి నుంచి పార్క్ చేసే కారు వరకు అక్కడ ప్రతీది ప్రత్యేకమే. వందల మంది సిబ్బంది ఆ ఇంట్లో పని చేస్తారు. వేసవికాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా, వాన కాలంలో ఆహ్లాదంగా మారిపోవడం ఆ ఇంటి గొప్పతనం. భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడ గలిగే సామర్థ్యం ఆ ఇల్లు సొంతం. అలాంటి ఇల్లు ఈ భూ ప్రపంచం మీద ఎవరికీ ఉండదని చాలామంది అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అంటిలియాను మించిన ఇల్లు నిర్మితమైంది. అన్నట్టు ఆ ఇల్లును నిర్మించుకున్నది కూడా ఒక భారతీయుడే. ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడ ఉంది? ఎవరు నిర్మించాడు? ఆయన నేపథ్యం ఏమిటి? ఈ కథనంలో తెలుసుకుందాం.

    గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలుసు కదా! తన అచంచలమైన ప్రతిభతో గూగుల్ కంపెనీ సారధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆమధ్య తమిళనాడులోని తన ఇంటిని విక్రయించినప్పుడు చాలామంది సుందర్ కు ఏమైంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అతడు సాధించిన ఘనత చూస్తే ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు.. గూగుల్ సీఈఓ గా నియమితుడైన తర్వాత తనకు వచ్చే వేతనం ద్వారా సుందర్ ఒక అద్భుతమైన ఇంటిని నిర్మించుకున్నాడు. దానిని అద్భుతమనాలి. అంతకుమించి అనాలి. ఎందుకంటే ఆ ఇంట్లో సౌకర్యాలు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి. సుందర్ తన ఇంటిని అమెరికాలోని కాలిఫోర్నియాలోని ” లాస్ట్ ఆల్టోస్ హిల్స్” లో నిర్మించుకున్నాడు. 4,429 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించుకున్నాడు. ఇది బయటికి చూస్తే ఐదు నక్షత్రాల హోటల్ లాగా కనిపిస్తుంది. ఇందులో నాలుగు బెడ్ రూం లు, స్పా, జిమ్, స్విమ్మింగ్ ఫూల్ లు ఉన్నాయి. సుందర్ వ్యక్తిగతంగా క్రీడలను ఇష్టపడతాడు కాబట్టి.. టెన్నిస్, మినీ గోల్ఫ్ కోర్టులను నిర్మించుకున్నాడు. వారాంతాల్లో తన కుటుంబంతో కలిసి ఇక్కడ ఆటలాడుతాడు. ఈ ఇంటి నిర్మాణం కోసం 332 కోట్లను సుందర్ పిచాయ్ ఖర్చు చేశాడు.

    ఈ ఇల్లు పూర్తిగా సౌరశక్తి ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఇంట్లో అధునాతనమైన క్రోటాన్ మొక్కలు ఉన్నాయి. ఆక్సిజన్ అధికంగా ఉత్పత్తి చేసే రావి చెట్లు కూడా ఉన్నాయి. దీనికి తోడు భారతీయ వాస్తు విధానం ప్రకారం ఈ ఇంటిని నిర్మించారు. అతిధులు వస్తే సేద తీరేందుకు ఎయిర్ లాంజ్ కూడా నిర్మించారు. ఈ ఇల్లు నిర్మించేందుకు ఒక్క చెట్టును కూడా నరకలేదు. పైగా అడ్డుగా ఉన్న మొక్కలను ఈపుగాపించి వాటికి ఒక ఆకృతి తీసుకొచ్చారు. భూకంపాలను, ప్రకృతి విపత్తులను తట్టుకునే విధంగా ఈ ఇల్లును నిర్మించారు. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు కాలిపోకుండా ఫైర్ ప్రూఫ్ కలప వాడారు. సుందర్ తన పని ముగించుకున్న తర్వాత ఈ ఇంట్లోనే ఎక్కువ సేపు గడుపుతారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అంటిలియా చూసేందుకు పొడవైన ఆకృతిలో కనిపిస్తుంది.. ఈ ఇల్లు మాత్రం ఎక్కువ విస్తీర్ణంలో ఉండటం వల్ల ఫైవ్ స్టార్ హోటల్ ను తలపిస్తుంది. గూగుల్ సీఈవో బట్టి ఆ స్థాయిలో ఇల్లు ఉంది. అందుకే మన పెద్దలు ఎంత చెట్టుకు అంత గాలి సామెతను ఇలాంటి వాటిని చూసే వాడుకలోకి తెచ్చారు అనుకుంటా!