Satyendra Nath Bose: భారతీయ భౌతిక, గణిత శాస్త్రవేత్తకు సత్యేంద్రనాథ్ బోస్‌కు అరుదైన గౌరవం దక్కింది. గూగుల్ తన డూడుల్‌తో సత్యేంద్ర నాథ్ బోస్‌కు నివాళులర్పించింది. 98 సంవత్సరాల క్రితం ఇదే రోజు.. అంటే జూన్ 4, 1924న క్వాంటం సూత్రీకరణలపై తన పత్రాన్ని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు పంపించారు. బోస్. క్వాంటం మెకానిక్స్‌లో ఇదో ముఖ్యమైన ఆవిష్కరణగా నిలిచింది. అందుకే జూన్ 4న సత్యేంద్రనాథ్ బోస్‌ను స్మరించుకునేలా గూగుల్ తన డూడుల్‌లో పెట్టింది.

దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త..
భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలో ఒకరైన సత్యేంద్రనాథ్బోస్ 1894, జనవరి1న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో జన్మించారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన హిందూ స్కూల్, ప్రెసిడెన్సీ కాలేజీలో చదివారు. బోస్‌కు చిన్నతనం నుంచే గణితంపై మక్కువ ఎక్కువ. దీంతో బోస్ తండ్రి కూడా అతన్ని గణితంపై ప్రోత్సహించారు. ప్రతిరోజూ ఒక అంక గణిత సమస్యను బోస్‌కు ఇచ్చేవారు. తండ్రి ఇచ్చిన సమస్యను ఈజీగా పరిష్కరించేవారు బోస్. అలా అతను గణితంపై మరింతగా పట్టు సాధించారు. కోల్ కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చదివారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో అప్లయిడ్ మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఢాéకా విశ్వవిద్యాలయంలో (1921–45) ఆపై కలకత్తాలో (1945–56) బోధించాడు. గణితంపై బోస్ రాసిన అనేక శాస్త్రీయ పత్రాలు 1918 నుండి 1956 వరకు ప్రచురించబడ్డాయి. మెకానిక్స్, అయానోస్పియర్ విద్యుదయస్కాంత లక్షణాలు, ఎక్స్–రే క్రిస్టల్లాగ్రఫీ, థర్మోల్యూమినిసెన్స్ సిద్ధాంతాలను బోస్ రచించారు. బోస్ రాసిన ప్లాంక్ చట్టం మరియు లైట్ క్వాంటా యొక్క పరికల్పన పత్రాలను తన పరిశోధనల కోసం ఉపయోగించున్నారు ఐన్‌స్టీన్.
Also Read: Hyderabad Gang Rape: గ్యాంగ్ రేప్ పొలిటికల్ టర్న్.. కేసీఆర్‌ను టార్గెట్ చేసిన బీజేపీ!
భౌతిక శాస్త్రంలో..
సత్యేంద్రనాథ్ బోస్ బీఎస్సీలో అనువర్తిత గణితశాస్త్రం ప్రధాన విషయంగా తీసుకొని 1913 లో మొదటి స్థానంలో ఉత్తీర్ణుడయ్యారు. 1915 లో అనువర్తిత గణిత శాస్త్రంలో ఎంఎస్సీని ప్రథమ స్థానంలో పూర్తి చేసి కలకత్తా విశ్వవిద్యాలయంలో కొత్త రికార్డు స్పష్టించారు. ఇంతవరకు ఈ రికార్డును ఎవరూ అధిగమించలేదు. ఎంఎస్సీ పూర్తి చేసిన తర్వాత 1916లో కలకత్తా విశ్వవిద్యాలయంలో పరిశోధకునిగా చేరాడు. 1916 నుంచి 1921 వరకు భౌతిక విభాగంలో అధ్యాపకుడిగా పనిచేశారు. మేఘనాథ్ సాహాతోపాటు బోస్ 1919 లో ఐన్‌స్టీన్ ప్రత్యేక, సాధారణ సాపేక్షతపై రాసిన పత్రాల జర్మన్, ఫ్రెంచ్ భాషా అనువాదాల ఆధారంగా ఆంగ్లంలో ప్రచురితమయ్యాయి. సాపేక్ష సిద్ధాంతపై పరిశోధనలు చేశారు. బెంగాలీ, ఆంగ్లం, ప్రెంచ్, జర్మన్, సంస్కృత భాషల్లోనూ బోస్ రచనలు ఉన్నాయి. వయొలిన్‌ను పోలి ఉండే ఎస్రాజ్ వాయించేవారు బోస్.

1924 లో ఢాకా విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర విభాగంలో రీడర్‌గా పనిచేస్తున్నప్పుడు.. భౌతికశాస్త్రం గురించి ప్రస్తావించకుండా, ప్లాంక్ యొక్క క్వాంటం వికిరణాల నియమంపై పరిశోధనాపత్రాన్ని రాశారు. ఈ పత్రం క్వాంటం గణాంకాల రంగంలో కీలకంగా మారింది. అయితే దీని ప్రచురణకు సంస్థలు అంగీకరించలేదు. దీంతో బోస్ ఆ పత్రాన్ని జర్మనీలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు పంపారు. బోస్ పంపిన పత్రాన్ని చదివిన ఐన్‌స్టీన్.. దానిని జర్మన్ భాషలోకి అనువదించారు. బోస్ తరఫున ప్రతిష్టాత్మక జీట్స్‌క్రిఫ్ట్ ఫర్ ఫిజిక్స్‌కు సమర్పించారు. దీంతో బోస్‌కు యూరోపియన్ ఎక్స్–రే, క్రిస్టల్లాగ్రఫీ ప్రయోగశాలలలో పనిచేసే అవకాశం దక్కింది. ఈ సమయంలోనే బోస్.. లూయిస్ డి బ్రోగ్లీ, మేరీ క్యూరీ, ఐన్‌స్టీన్‌లతో కలిసి పనిచేశారు.
బహుబాషా కోవిదుడు..
సత్యేంద్రనాథ్ బోస్ స్వయం బోధకుడు, బహుభాషా కోవిదుడు. భౌతిక, రసాయన శాస్త్రము, గణిత శాస్త్రము, జీవ శాస్త్రము, లోహ సంగ్రహణ శాస్త్రము, తత్వ శాస్త్రము, కళలు, సాహిత్యం, సంగీతం వంటి అనేక రంగాలలో కృషి చేశారు. బోస్ యొక్క సైద్ధాంతిక పత్రం క్వాంటం సిద్ధాంతంలో అత్యంత ముఖ్యమైన అన్వేషణలలో ఒకటిగా మారింది. భౌతిక శాస్త్రానికి ఆయన చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం.. అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో 1954లో సత్కరించింది.
Also Read:Chandrababu: టీడీపీ కొంపముంచుతున్న కోటరీ.. కట్టడి చేయలేకపోతున్న చంద్రబాబు
Recommended Videos