Homeజాతీయ వార్తలుIncome Tax: కేంద్రం గుడ్ న్యూస్ : 7 లక్షల వరకూ ఇక పన్ను లేదు

Income Tax: కేంద్రం గుడ్ న్యూస్ : 7 లక్షల వరకూ ఇక పన్ను లేదు

Income Tax
Income Tax

Income Tax: గత నెలలో కేంద్రం ప్రవేశపెట్టిన 2023_24 కేంద్ర వార్షిక బడ్జెట్లో పేర్కొన్న కొత్త ఆదాయపు పన్నుల్లో స్వల్ప సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక బిల్లు_23 ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు.. 64 సవరణలతో కూడిన ఈ బిల్లును లోక్ సభ ఆమోదించింది. దీని ప్రకారం ఆదాయపు పన్ను రాయితీ లిమిట్ ను ఐదు నుంచి ఏడు లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే దీని ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల లోపు సంపాదిస్తున్న వారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మరి ఏడు లక్షల వంద రూపాయల జీతం ఉంటే మాత్రం కచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే. అయితే ఇక్కడే వేతనజీవులకు కేంద్రం శుభవార్త చెప్పింది.

2023_ 24 నుంచి కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్నుపై ఉన్న రాయితీపరధిని కేంద్ర ఆర్థిక శాఖ ఏడు లక్షలకు పెంచింది. అయితే ఈ పరిమితి గురించి స్వల్పంగా అధిక వేతనం పొందుతున్న వారు మాత్రం నిరాశకు గురయ్యారు. అయితే ఏడు లక్షలకు పైగా అది కొద్ది మొత్తం సంపాదిస్తున్నవారు, ఆపై చెల్లించేలా నిబంధనల్లో మార్పులు చేశారు.. కానీ దీనిపై ఒక నిర్దిష్టమైన పరిమితిని మాత్రం కేంద్రం ప్రకటించలేదు. ఆర్థిక నిపుణులు అంచనా ప్రకారం 7,27, 777 వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు మాత్రం ఈ ఉపశమనంతో ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

Income Tax
Income Tax

ఎలాగంటే?

ఉదాహరణకి ఒక వ్యక్తి ఏడాది ఆదాయం 7 లక్షలు అనుకుంటే.. ఏప్రిల్ ఒకటి అనంతరం అతడు ఆదాయపు పన్ను పరిధిలోకి రాడు. తద్వారా ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అదే వ్యక్తి ఆదాయం 7 లక్షల 100 రూపాయలు అనుకుంటే అతడు 25 వేలకు పైగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయంలో 100 రూపాయలు పెరగడం వల్ల 25,000 అదనంగా చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తాజా నిబంధన ప్రకారం ఏడు లక్షల వంద రూపాయలు జీతం పొందుతున్న వ్యక్తి కేవలం ఆపై 100 ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. ఇక తాజా బడ్జెట్లో పాత పన్ను విధానంలో ప్రభుత్వం ఎటువంటి మార్పులు తీసుకురాలేదు.. అయితే ఓల్డ్ రెజీమ్ లో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ను సైతం కొత్త విధానానికి వర్తింపజేయడం విశేషం. అయితే ఐదు కోట్ల వార్షిక ఆదాయం ఉన్న వారి పైనా పన్ను పోటు తగ్గించి ఇటువైపు ఆకర్షించేందుకు మోడీ ఈ రకమైన ప్లాన్ వేశాడని ఆర్థికవేత్తలు అంటున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular