Union Budget 2023 For Jobs: ఉద్యోగాల కల్పనలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం… ఈసారి బడ్జెట్లో గుడ్ న్యూస్ చెప్పింది.. ఈ దేశ యువతే అభివృద్ధికి చోదక శక్తి అని అభివర్ణించిన నిర్మల… వారి ఉన్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. కోవిడ్ వల్ల అనుకున్నంత మేర ఉద్యోగాలు కల్పించలేకపోయామని… ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ ఆ పరిస్థితి మళ్లీ తలెత్తనివ్వమని ఆమె స్పష్టం చేశారు.. గిరిజన విద్యార్థుల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 38, 800 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఆమె తెలిపారు.. అంతేకాదు కొత్తగా 150 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను దేశవ్యాప్తంగా 740 నెలకొల్పామని, ఇందులో 3.5 లక్షల గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని వివరించారు.

ప్రస్తుతం ఉన్న 157 మెడికల్ కాలేజీ లతో కలిపి మరో 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.. పిల్లలు, వయసు ఉన్న వారికి జాతీయ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నట్టు సీతారామన్ పేర్కొన్నారు. భౌగోళిక అంశాలు, భాషలు, కళలకు సంబంధించి నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేసేందుకు దీనిని ఏర్పాటు చేయబోతున్నట్టు ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం యువతరం భారతీయ జనతా పార్టీ పై ఆగ్రహంగా ఉంది.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి.. వీటికి సంబంధించి రైల్వే శాఖ మినహా మిగతా ఏ విభాగాల్లోనూ ఉద్యోగుల భర్తీ జరగడం లేదు.. దీంతో ఉన్న వారిపై ఒత్తిడి పెరుగుతున్నది.. మరోవైపు ప్రతిపక్షాలు ఇదే విషయం మీద కేంద్రాన్ని కడిగిపారేస్తున్నాయి.. ఈ క్రమంలో ఉద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కేంద్రం భర్తీ ప్రక్రియకు పచ్చ జెండా ఊపింది. ఇందులో భాగంగా ఏకలవ్య పాఠశాలలో మొదట ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.. ఆ తర్వాత మిగతా విభాగాల్లో ఆ ప్రక్రియ చేపడుతుందని కేంద్రమంత్రి నిర్మల పేర్కొన్నారు
