Samantha: స్టార్ లేడీ సమంత ఆరోగ్యం గురించి కంగారు పడుతున్న అభిమానులకు ఇది శుభవార్త. ఆమె దాదాపు కోలుకున్నట్లే. కారణం సమంత తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ముంబైలో జరుగుతున్న సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కి సమంత హాజరైనట్లు తెలుస్తుంది. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ మొదలు కాగా సమంత-వరుణ్ ధావన్ పాల్గొన్నారు. సిటాడెల్ హాలీవుడ్ సిరీస్ రీమేక్. ఇందులో సమంత, వరుణ్ ధావన్ గూఢచారులుగా నటిస్తున్నారని సమాచారం. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకులుగా ఉన్నారు. సిటాడెల్ సిరీస్ కి సమంత సైన్ చేసి చాలా కాలం అవుతుంది. సమంత కారణంగా రెగ్యులర్ షూట్ కొంత ఆలస్యమైంది.

సిటాడెల్ కోసం సమంత బాగా కష్టపడ్డారు. ఆమె యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నారని సమాచారం. ఇక మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చారు. యశోద షూటింగ్ పూర్తయ్యాక సమంత అనారోగ్యం గురించి వెల్లడించారు. తిరిగి నటన ప్రారంభించగా సమంత కోలుకున్నారన్న స్పష్టత వస్తుంది. ఇక సమంత ఖాతాలో ఉన్న మరో ప్రాజెక్ట్ ఖుషి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు.
దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి మూవీ చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. త్వరలో ఖుషి చిత్రీకరణ సైతం మొదలు కానుంది. మిగిలి ఉన్న షూటింగ్ పార్ట్ పూర్తి చేసి ఈ ఏడాది విడుదల చేయనున్నారు. ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. మరోవైపు సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 17న శాకుంతలం వరల్డ్ వైడ్ 5 భాషల్లో విడుదల కానుంది.

దర్శకుడు గుణశేఖర్ పౌరాణికగాథగా శాకుంతలం తెరకెక్కించారు. సమంత శకుంతల పాత్ర చేస్తున్నారు. ఆమె భర్త దుష్యంతుడుగా మలయాళ నటుడు మోహన్ దేవ్ కనిపించనున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు కీలకమైన దుర్వాస మహర్షి రోల్ చేస్తున్నారు. విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. శాకుంతలం మూవీలో అల్లు అర్జున్ కూతురు అర్హ బాలనటిగా చేయడం విశేషం. ఆమె సమంత కొడుకుగా కనిపించనుంది. శాకుంతలం చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.