Good Friday : క్రిస్టియన్లు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు. దీనికోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ గుడ్ ఫ్రైడే క్రిస్టియన్లకు చాలా ముఖ్యమైనది. అయితే క్రైస్తవ మత విశ్వాసం ప్రకారం ఏసుక్రీస్తు శుక్రవారం శిలువపై ప్రాణాలు అర్పించారని చెప్పుకుంటారు. అయితే దేశంలో కంటే యూరప్ దేశాల్లో ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ గుడ్ ఫ్రైడే రోజున ఏసు చనిపోయారు. అందుకు ఈ రోజున సంతాప దినంగా కూడా భావిస్తారు. అయితే గుడ్ ఫ్రైడేకి, చేపలు, రొట్టెలకు లింక్ ఉంది. ఈ గుడ్ ఫ్రైడే రోజున క్రిస్టియన్లు అందరూ కూడా చేపలు, రొట్టెలు తింటారు. అందులోనూ ఐదు రొట్టెలు, రెండు చేపలు తింటారు. అయితే ఈ ఐదు రొట్టెలు, రెండు చేపలకి, గుడ్ ఫ్రైడేకి లింక్ ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
Also Read : హార్వర్డ్ ఆశలపై నీళ్లు.. విదేశీ విద్యార్థుల కల చెదురుతోంది
ఓ రోజు ఏసుక్రీస్తూ సముద్రం దాటి వెళ్లాడు. ప్రజలు అందరికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకుని దూరంగా వెళ్లాడు. అయినా కూడా ప్రజలు అతన్ని విడిచిపెట్టలేదు. ఆయనతో ఉండాలని ప్రజలు వెళ్లారు. దాదాపుగా ఒక 5 వేల మంది అలా వెళ్లారు. అడవిలో ఏసుక్రీస్తు వారికి బోధనలు చెబుతున్నారు. అయితే మధ్యలో భోజన సమయం కావడంతో ఆకలి వేసింది. దీంతో చుట్టూ చూశారు. కానీ అక్కడ తినడానికి చుట్టు పక్కల ఎంత వెతికినా ఏం దొరకలేదు. అయితే అతనితో వచ్చిన ఓ పిల్లవాడి దగ్గర ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉంటాయి. ఇవి అందరికి సరిపోవు. అయితే ఈ రొట్టెలను అందరికీ పంచండి అని చెబుతారు. ఇవి అందరికీ పంచుతుండగా.. మొత్తం 5 వేల మంది కూడా తిన్నా.. అయిపోలేదు. ఎంత తింటున్నా కూడా ఆ రొట్టెలు ఉంటూనే ఉన్నాయి. ఏసుక్రీస్తు అద్భుతాన్ని ప్రజలు కళ్లారా చూసి షాక్ అయ్యారు. అప్పటి నుంచి ప్రతి గుడ్ ఫ్రైడే రోజున ఐదు రొట్టెలు, రెండు చేపలను పంచడం ఆనవాయితీగా వచ్చింది. అప్పటి నుంచి గుడ్ ఫ్రైడే రోజు ఐదు రొట్టెలు, రెండు చేపలను తింటున్నారు.
ఇదిలా ఉండగా ఈస్టర్ పండుగ రోజు కోడి గుడ్లతో అలంకరించే సంప్రదాయం కూడా ఎప్పటి నుంచో ఉంది. రకరకాల కోడి గుడ్లుతో ఎంతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. అయితే పురాతన కాలం నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఎక్కువగా ఐరోపా, ప్రాచీన మధ్య దేశాల్లో దీన్ని ఫస్ట్ చేసుకునే వారు. వసంత కాలంలో వచ్చే ఈస్టర్ పండుగ నాడు తప్పకుండా అందరూ కూడా కోడి గుడ్లను రకరకాల రంగులతో అలంకరిస్తారు. అలాగే ఈస్టర్ పండుగ నాడు కోడి గుడ్లను ఒకరికి ఒకరు ఇచ్చుకుంటారు. దీన్ని వారు మంచిగా భావిస్తారు. ఇలా ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుందని, కుటుంబంతో సంతోషం ఏర్పడుతుందట. ముఖ్యంగా పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారట. సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈస్టర్ ఎగ్స్‌ను తీసుకోవాలి. అలాగే ఇవ్వాలి. దీనివల్ల వారికి అంతా కూడా మంచే జరుగుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని అంటున్నారు.