Golden Tortoise : పోతులూరి వీరబ్రహ్మం అప్పట్లోనే ‘కాలజ్ఞానం’ చెప్పి భవిష్యత్తును అంచనా వేశారు. ఇప్పుడు ఆయన చెప్పిందే నిజమైంది. ‘చైనా దేశంలో కరోనా అనే పురుగు పుట్టి చంపేస్తుందని’ బ్రహ్మంగారు అన్నట్టే ఇప్పుడు జరుగుతోంది. ఇక ఆయన చెప్పిన ఎన్నో వింతలు విశేషాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి.

కలియుగంలో వింతగా ఏది జరిగినా బ్రహ్మంగారు ముందే చెప్పారు అని వార్తలు వస్తుంటాయి. అలానే ఈసారి బ్రహ్మంగారు చెప్పినట్టే మరో వింత జరిగింది. అదే బంగారు తాబేలు జననం..

ప్రస్తుతం పుట్టిన బంగారు తాబేలు గురించి అందరూ ఆరాతీస్తూ ఇది బ్రహ్మంగారు చెప్పిందేనని అంటున్నారు. బంగారు కవచంతో ఓ తాబేలు నేపాల్ దేశంలో జన్మించింది. నేపాల్ లో తాబేళ్లను దేవుడిగా పూజిస్తారు. బంగారు రంగులో ఉన్న ఈ తాబేలు మెరుస్తూ చూడగానే బంగారు తాబేలునేనని అంటున్నారు. అలా ఇది మెరుస్తుంది కూడా..
దీంతో బ్రహ్మంగారు చెప్పినట్టే బంగారు తాబేలు పుట్టిందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే బంగారు తాబేలు పుట్టదని.. జన్యు లోపాల కారణంగానే తాబేలు ఇలా రంగు మారుతాయని నిపుణులు అంటున్నారు. భక్తులు మాత్రం ఈ తాబేలు దేవుడి సృష్టి అని దీనికి వేల పూజలు చేస్తున్నారు.
[…] Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను-బాలయ్య కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ ఫిల్మ్ వసూళ్లతో దూసుకుపోతున్నది. కాగా, ఈ చిత్రంలో ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసి హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు థాంక్స్ చెప్పారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. […]
[…] Jagan: ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య తలెత్తిన పీఆర్సీ వివాదం ఇంకా ముదురుతున్నది. పీఆర్సీ అమలు చేసేలా జగన్ సర్కారు జీవోలను జారీ చేయగా, వాటిని మంత్రివర్గం ఆమెదించడంతో పాటు వెనక్కి తగ్గేది లేదని తెలిపింది. దాంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు దశల వారీగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఏపీ సర్కారుపై పోరుకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించనున్నారు. […]