Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను-బాలయ్య కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ ఫిల్మ్ వసూళ్లతో దూసుకుపోతున్నది. కాగా, ఈ చిత్రంలో ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసి హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు థాంక్స్ చెప్పారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

Balakrishna Akhanda
ఓపెన్ జీప్‌లో హీరో బాలయ్య, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ప్రయాణిస్తున్న క్రమంలో ఎదురుగా లారీ రాగానే, బాలయ్య బ్రేక్ వేస్తాడు. అప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని హీరోయిన్‌కు బాలయ్య సూచిస్తారు. ‘జీవితం చాలా విలువైనదని, సీట్ బెల్ట్ పెట్టుకోవడం కంపల్సరీ’ అనే సందేశాన్ని బాలయ్య చిత్రం ద్వారా ఇవ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా ఈ వీడియో జత చేసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు.
Also Read: వైరల్ అవుతున్న టుడే క్రేజీ మూవీ అప్ డేట్స్ !
ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలా బాలయ్య చక్కటి సామాజిక సందేశాన్ని ఇవ్వడం మంచి విషయమని ఈ సందర్భంగా నెటిజన్లు బాలయ్యను తెగ పొగిడేస్తున్నారు. సీట్ బెల్ట్ ధరించడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు చైతన్యం కలిగించేందుకుగాను బాలయ్య సినిమా ద్వారా ప్రయత్నించడం హర్షించదగిన విషయమని అంటున్నారు. ‘అఖండ’ చిత్రంలో ఈ 17 సెకన్ల వీడియో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సారి సీట్ బెల్ట్ తప్పనిసరి అని, దూరం ఎంత అనేది కాదని, కారు ఎవరిదనేది లెక్క కాదని, ప్రతీ సారి సీట్ బెల్ట్‌ను తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు

Nandamuri Balakrishna
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కలిగేలా సన్నివేశాన్ని చిత్రీకరించిన బోయపాటి శ్రీనుకు, సినిమా హీరో బాలయ్య, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కు ఈ సందర్భంగా పోలీసులు మరో సారి థాంక్స్ చెప్పారు. ఇకపోతే ఈ చిత్రం తాజాగా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా సత్తా చాటుతోంది. బాలయ్య ‘అఘోర’ అవతారం చూసి సినీ ప్రేక్షకులు ఆనందపడిపోతున్నారు. మొత్తంగా ‘అఖండ’మైన మాస్ జాతర ఇంకా కొనసా..గుతున్నది. ఈ చిత్రంలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించగా, స్టైలిష్ విలన్ జగపతిబాబు కీలక పాత్ర పోషించారు.
Also Read: మీకు ‘గురక’ వస్తోందా ? ఐతే ఇలా చేయండి మళ్ళీ జన్మలో రాదు !
#HYDTPweBringAwareness
No Matter How Far,
No Matter Whose Car,
Always Buckle Up! #WearASeatBelt #seatbelt
Thank you #NandamuriBalaKrishna Garu & #BoyapatiSrinu Garu for promoting Road Safety. #Akhanda @JtCPTrfHyd pic.twitter.com/Iyhoq0iN2V— Hyderabad Traffic Police (@HYDTP) January 23, 2022