Viral News : తవ్వుతున్న కొద్ది బంగారం.. అలాగని అదేం కేజీఎఫ్ సినిమాలో లాగా బంగారుగని కాదు. సమాధి.. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికి నిజం.. 1200 సంవత్సరాల నాటి ఒక సమాధిని శాస్త్రవేత్తలు ఇటీవల అమెరికాలోని పనామాలో కనుగొన్నారు.. దాన్ని తవ్వుతుండడంతో ఈ బంగారు నిక్షేపాల కథ ఒక్కసారిగా బయటి ప్రపంచానికి తెలిసింది.
పనమా దేశానికి 100 కిలోమీటర్ల దూరంలో ఎల్ కానో అనే ఆర్కియాలాజికల్ పార్కు ఉంది. ఈ పార్కులో ఇటీవల శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతుండగా 1200 సంవత్సరాల నాటి ఒక సమాధి బయటపడింది. ఆ సమాధిలో చాలావరకు మృతదేహాల ఎముకలు లభించాయి. వాటితోపాటు భారీ ఎత్తున బంగారంతో కూడిన నిధి వెలుగు చూసింది. నిధి మాత్రమే కాదు బంగారంతో తయారుచేసిన దుస్తులు, బ్రాస్ లెట్, గంటలు, తిమింగలం దంతాలను పోలివున్న బంగారు చెవి పోగులు, నగలు, పింగాణి వస్తువులు అందులో కనిపించాయి.. అయితే ఈ సమాధి కోకిలే సామాజిక వర్గానికి చెందిన ప్రభువుదని పరిశోధకులు గుర్తించారు. ఈ సమాధి పక్కనే మరో 32 మృతదేహాల అస్తికలు లభించాయి. కోక్లే సామాజిక వర్గానికి చెందిన వారి సంస్కృతి ప్రకారం.. ప్రభువు చనిపోతే.. 32 మందిని బలి ఇస్తారట. అందువల్లే ఆ సమాధి పక్కన 32 మందికి చెందిన ఆనవాళ్లు కనిపించాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అమెరికాకు చెందిన జూలియా మయో ఈ తవ్వకాలకు సారథ్యం వహిస్తున్నారు.
2022లో ఈ ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఆ తవ్వకాలలో లభించిన వస్తువులను శాస్త్రవేత్తలు భద్రంగా దాచారు. ఇక్కడి ఆర్కియాలజికల్ పార్క్ ను క్రీస్తుశకం 700లో నెక్రో పోలిస్ నిర్మించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత 300 సంవత్సరాలకు దానిని వదిలేసారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో మరిన్ని సమాధులు ఉండటంతో శాస్త్రవేత్తలు తవ్వకాలను ముమ్మరం చేశారు.