Viral Video: మారుమూలన ఇన్నాళ్లు బతికిన అందరి టాలెంట్ బయటకు వచ్చేది కాదు. కానీ సోషల్ మీడియా వచ్చాక అందరి ప్రతిభ బయటకు వస్తోంది. ఏ మూలన ఎవరు వినూత్నంగా చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాహ్య ప్రపంచంలో వారి ప్రతిభ ఇనుమడిస్తోంది. ఒకప్పుడు డ్యాన్స్ అంటే సినిమాలు, టీవీషోలల్లోనే కనిపించేంది. కానీ ఇప్పుడు ఏ మూలన ఎవరు వినూత్నంగా చేసినా వారి ప్రతిభ లోకానికి తెలుస్తోంది.

ముఖ్యంగా మారుమూలన, నగరాల్లోని గల్లీలో ఉన్న అమ్మాయిల టాలెంట్ వెలుగుచూస్తోంది. వారి టాలెంట్ ను ఎలా బయటపెట్టాలో ఇంతవరకూ తెలిసేది కాదు.. కానీ ఇప్పుడు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పుడు అలా కాదు.. చాలా మంది అమ్మాయిలు వాళ్లకు ఉన్న టాలెంట్ ను వీడియోగా తీసి ఇన్ స్టా, యూట్యూబ్ లలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో తెగ వైరల్ అవుతోంది.
డ్యాన్స్ అంటే అభిమానించే అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు. అలా తమ ప్రాంతాల్లో పండుగలు, పబ్బాలకు వాళ్లు చేసే డ్యాన్సులు అలరిస్తున్నాయి. అది కాస్త సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అవుతోంది. ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్ గా వాళ్లు మారిపోతున్నారు. షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన లాంటి వాళ్లు ఇలాగే సోషల్ మీడియా ద్వారానే పాపులర్ అయ్యారు.
తాజాగా ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ అందరినీ ఫిదా చేసింది. బోనాల పండుగ వేళ డప్పు చప్పుళ్లకు ఆమె చేసిన డ్యాన్స్ ఉర్రూతలూగించేలా ఉంది. ఆ అమ్మాయి సిగ్గుపడుతుండగా కొందరు ఎంకరేజ్ చేయడం.. ఆమెతో కలిసి పాదం కలపడంతో ఇక ఆ డ్యాన్స్ వైరల్ గా మారింది.
బోనాల పండుగలో లంగాఓణి ధరించి ఈమె చేసిన డ్యాన్స్ అదరగొట్టేలా ఉంది. దరువుకు అనుగుణంగా స్టెప్పులేస్తూ సందడి చేసింది. ఈ అందమైన అమ్మాయి మాస్ డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన అందం, అభినయంతో ఈ అమ్మడు చేసిన డ్యాన్స్ చూపుతిప్పుకోనివ్వకుండా ఉంది. మీరూ ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.