Ghost in Bed Room: దెయ్యాల గురించి వినడమే కానీ ఎప్పుడు చూసింది లేదు. చెట్టు మీద దెయ్యం నాకేం భయ్యం అంటూ చిన్నప్పుడు దెయ్యాలు రాకుండా పాడుకునే వాళ్లం. కానీ ఇంతకీ దెయ్యాలున్నాయా? లేవా? అంటే కొందరు ఉన్నాయని వాదిస్తారు. కొందరు లేవని చెబుతారు. ఈ నేపథ్యంలో దెయ్యాల టాపిక్ ఎందుకని అనుకుంటున్నారా? నిజమే దెయ్యాల గురించి చాలా కథలు, సినిమాలు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా దెయ్యాన్ని చూసిన దాఖలాలు లేవు. అయితే స్కాట్లాండ్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.

ఓ తండ్రి తన రెండేళ్ల కొడుకుతో తన బెడ్ రూంలో ఉన్నాడు. తండ్రి సెల్ ఫోన్ లో బిజీగా ఉండగా కొడుకు ఎవరికి టాటా చెబుతున్నాడు. దీంతో ఎవరున్నారు అక్కడ అని అడిగితే సమాధానం చెప్పకుండా నవ్వుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఎవరు కనిపించడం లేదు. కానీ అతడు ఎందుకు టాటా చెబుతున్నాడని పరిశీలించి చూసినా ఏం కనిపించలేదు.
Also Read: Acharya Industry Hit: ఈ చిన్న మార్పులు చేసి ఉంటే ఆచార్య ఇండస్ట్రీ హిట్ అయ్యేదా..?
కానీ ఆ పిల్లాడు మాత్రం చేయి ఊపుతూనే ఉన్నాడు. దీంతో సంబరపడుతూ చేయి ఊపుతూ నవ్వుతున్నాడు. ఎవరికి హాయి చెబుతున్నావని అడిగినా మాట్లాడలేదు. అప్పుడు అతడికి అర్థమైంది. తన అమ్మ అంటే చిన్నోడికి చాలా ఇష్టమని అందుకే అతడికి కనబడి హాయి చెప్పిందని అనుకున్నాడు. అయితే తన తల్లితో తప్ప ఎవరికి కూడా చేతులు ఊపని చిన్నోడు తన తల్లి ఆత్మను చూసే అలా చేశాడని భయానికి గురయ్యాడు.
తన తల్లి ఆత్మ చిన్నోడికి కనిపించి అలా చేసిందని చెబుతున్నాడు. మొత్తానికి ఆత్మలున్నాయా? లేవా? అనేదానికి ఇదే సంకేతమని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. దెయ్యాలు కూడా ఉన్నాయని చెప్పేందుకు ఇదే ఉదాహరణ అని పేర్కొంటున్నారు. దెయ్యం దెబ్బకు తండ్రికి మాత్రం చుక్కలు కనిపించినట్లు తెలుస్తోంది. ఇకపై ఒంటరిగా గదిలో పడుకోవాలంటే భయమేస్తోందని చెబుతున్నాడు.
Also Read: Bheemla Nayak US Record: అమెరికా లో భీమ్లా నాయక్ రికార్డ్ ని ముట్టుకోలేకపోయినా పాన్ ఇండియా సినిమాలు