Homeఎంటర్టైన్మెంట్Kiara Advani: మరికొద్ది రోజుల్లో పెళ్లి? కియారాకు షాక్ ఇచ్చిన ప్రియుడు!

Kiara Advani: మరికొద్ది రోజుల్లో పెళ్లి? కియారాకు షాక్ ఇచ్చిన ప్రియుడు!

Kiara Advani: వచ్చే నెలలో కియారా అద్వానీ వివాహం అని ప్రచారం జరుగుతుండగా ఆమె ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. బాలీవుడ్ వర్గాల్లో అతిపెద్ద చర్చకు దారితీశాయి. విషయంలోకి వెళితే… హీరో సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ ప్రేమించుకుంటున్నారంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. వీరిద్దరూ కలిసి షేర్షా మూవీలో నటించారు. ఆ మూవీ సెట్స్ లో కియారా-సిద్ధార్థ్ ప్రేమలో పడ్డారట. ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నారనేది బాలీవుడ్ వర్గాల వాదన. ఈ క్రమంలో తరచుగా పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నాయి.

Kiara Advani
Kiara Advani

2022 డిసెంబర్ లో కియారా వివాహం అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డిసెంబర్ ముగిసిపోగా…ఫిబ్రవరిలో అని మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈసారి డేట్, వెన్యూ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 6న రాజస్థాన్ లోని జైసల్మేర్ వేదికగా కియారా-సిద్ధార్థ్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. జైసల్మేర్ వెళ్లిన ప్రత్యేక సిబ్బంది కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు మూడు రోజులు మెహందీ, సంగీత్ కార్యక్రమాలతో ఘనంగా వివాహం జరగనుందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఈ వార్తల నేపథ్యంలో త్వరలో కియారా పెళ్లి అని జనాలు మైండ్స్ లో ఫిక్స్ అయ్యారు. అనూహ్యంగా హీరో సిద్ధార్థ్ బాంబు పేల్చాడు. ఇప్పటికే రెండు సార్లు నా పెళ్లి అన్నారు. అయితే నన్నెవరూ పిలవలేదు. నా వ్యక్తిగత విషయాలపై కాకుండా సినిమాలపై దృష్టి పెడితే మంచిది… అని పరోక్షంగా కియారాతో పెళ్లి వార్తలను ఖండించారు. ఈ క్రమంలో మీడియాతో పాటు బాలీవుడ్ జనాలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అంతా కుదిరింది పెళ్లే తరువాయి అనుకుంటున్న తరుణంలో సిద్ధార్థ్ వ్యాఖ్యలు అనేక అనుమానాలకు కారణమయ్యాయి.

Kiara Advani
Kiara Advani

పెళ్లి చేసుకుందాం అనుకుని కూడా వీరు క్యాన్సిల్ చేసుకున్నారా? కియారాకు సిద్ధార్థ్ బ్రేకప్ చెప్పారా?.. అనే సందేహాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా ఎప్పటి నుండో సన్నిహితంగా ఉంటున్న కియారా-సిద్ధార్థ్ ప్రేమించుకుంటున్నట్లు వెల్లడించింది లేదు. కాగా సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ మిషన్ మజ్ను జనవరి 20న నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇందులో రష్మిక మందాన హీరోయిన్. ఇక కియారా హీరో రామ్ చరణ్ కి జంటగా ఆర్సీ 15 చేస్తుంది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper