Tandoori Kandi Pappu: అవి కందులే.. కాకపోతే రత్నాల మాదిరి ఉంటాయి. ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటాయి. తింటే దేహానికి మొత్తం మాంసకృతులు అందుతాయి.. అటువంటి కందికి మన భౌగోళిక వారత్వానికి కేంద్రం ఘనమైన గౌరవం దక్కింది. ఏకంగా గ్లోబల్ ఐడెంటిఫికేషన్ ఇచ్చేసింది.. దీనివల్ల తాండూరు కంది ఇక అంతర్జాతీయ బ్రాండ్ గా మారుతుంది. వాస్తవానికి తాండూరు ప్రాంతానికి సరిహద్దున ఉన్న కర్ణాటకలోని గుల్బర్గా ఏరియా లో భూములు కూడా ఇలానే ఉంటాయి.. గుల్బర్గాలో ప్రైడ్ ఆఫ్ తూర్ దాల్ అనే కమాన్లు ఉంటాయి.. ఆ బెల్టు మొత్తం నాణ్యమైన కందుల పంటకు చాలా ఫేమస్..

జాతీయ సగటు కంటే ఇక్కడ ఎక్కువ
తాండూరు ప్రాంతంలో సుమారు 50,000 ఎకరాల్లో కంది పంట సాగు అవుతుంది.. ఎకరానికి రైతులు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తారు.. జాతీయ సరాసరి 8 క్వింటాళ్ళు మాత్రమే. ఇక్కడ భూములు ఎర్ర చెక్క రకానికి చెందినవి. ఇవి నీటిని ఎక్కువ పీల్చుకొని ఏడాది మొత్తం భూమి లోపల తేమ ఉండేలా చేస్తాయి.. రైతులు కూడా విస్తారంగా కంది పంటను సాగు చేస్తారు.. దీనివల్ల ఈ ప్రాంతం మొత్తం కంది హబ్ గా మారింది. కానీ రైతుల ఆసక్తికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడంతో ఇబ్బంది పడేవారు.
కేంద్రం గుర్తింపుతో
కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ ఐడెంటిఫికేషన్ జారీ చేయడం ద్వారా తాండూరు కందికి అంతర్జాతీయ బ్రాండ్ హోదా దక్కింది.. దీనివల్ల ఇక్కడికి అందుకే విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది.. వాస్తవానికి తాండూర్ కందికి దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది.. ఈ ప్రాంతంలో ఉన్న మిల్లులు కందులను మర ఆడించి పప్పును ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తాయి.. అయితే దేశంలో ఇతర ప్రాంతాల్లో పడిన కందులను, తాండూరు కందులను పోల్చినప్పుడు… వీటిలో మాంసకృతుల శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది.. లో ఇక్రిశాట్ అధికారులు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి కందులను సేకరించారు.. తర్వాత వారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు.. కందుల ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం గ్లోబల్ ఐడెంటిఫికేషన్ కేటాయించింది.. దీనివల్ల ఇక్కడ రైతుల జీవితంలో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కంది పంటను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం ఇక్కడ ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది.. దీనివల్ల ఈ పంటకు విశేష ప్రాచుర్యం లభిస్తుంది. ఇంకా కేంద్రం గ్లోబల్ ఐడెంటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ఇక్కడ రైతుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.

తాండూరు నాణ్యతే వేరు
తాండూరు కంది లో విశిష్టమైన పోషకాలు ఉండటం వల్ల దీన్ని ఆహారంగా తీసుకుంటే మాంసంలో కంటే ఎక్కువ ప్రోటీన్లు దేహానికి అందుతాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.. పైగా ఇందులో నాణ్యత పాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం 24 గంటల పాటు పాడవకుండా ఉంటుంది.. పైగా ఇది రుచిగా ఉండటంతో పిల్లలు ఇష్టంగా తింటారు.. ఇక్కడ ఏటా 50 వేల ఎకరాల్లో పంట సాగు అవుతుండగా, మెజారిటీ కందిపప్పు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.. కేవలం ఈ పంట ద్వారా రాష్ట్రానికి సుమారు ఐదు నుంచి ఏడు కోట్ల దాకా ఆదాయం లభిస్తోంది.. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిని గుర్తించి అభివృద్ధి చేస్తే చాలా బాగుండేది.. కానీ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు.. అయితే ఇన్నాళ్లకు గ్లోబల్ ఐడెంటిఫికేషన్ లభించడంతో ఇక్కడ కంది పంటలో నవ శకం మొదలుకానుంది.